Jason Sanjay: ఇప్పటికీ నన్ను చిన్న పిల్లాడిలాగే చూస్తుంది.. అమ్మ సంగీత గురించి జాసన్ సంజయ్ ఏం చెప్పారంటే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jason Sanjay: దళపతి విజయ్ తనయుడు, ‘సిగ్మా’ (Sigma) చిత్ర దర్శకుడు జాసన్ సంజయ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన తల్లి సంగీత, చెల్లెలు దివ్య సాషా, కుటుంబంతో ఉన్న అనుబంధం గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన తన తల్లి సంగీత కుటుంబ నేపథ్యం గురించి చెబుతూ “మా అమ్మ ఉత్తర శ్రీలంకలో పుట్టి పెరిగారు. ఆ తర్వాత ఆమె కుటుంబం విదేశాల్లో స్థిరపడింది. ప్రస్తుతం మేము శ్రీలంక వెళ్తే అక్కడ మా తాతగారికి సంబంధించిన ప్రాపర్టీ చూసుకొని వస్తాం. నా మొదటి చిత్రం ‘సిగ్మా’ కోసం శ్రీలంకలో కొన్ని లొకేషన్లు కూడా చూశాం, అక్కడ షూటింగ్ చేయాలని ప్రయత్నించాం కానీ కుదరలేదు. శ్రీలంక అందాలను నా సినిమాలో చూపించాలని ఆశిస్తున్నాను, భవిష్యత్తులో తప్పకుండా అక్కడ షూటింగ్ చేస్తాను” అని సంజయ్ తెలిపారు.
తల్లి సంగీతతో ఉన్న అనుబంధం గురించి మాట్లాడుతూ “అమ్మ ఇప్పటికీ నన్ను ఒక చిన్న పిల్లాడిలాగే చూస్తుంది. పని ఒత్తిడిలో లేదా నిరాశలో ఉన్నప్పుడు నన్ను మొదటగా ప్రోత్సహించేది, ధైర్యం చెప్పేది అమ్మే. సినిమాలు, కథల విషయంలో ఆమె అభిప్రాయాలకు నేను చాలా ప్రాధాన్యత ఇస్తాను. ఎందుకంటే అమ్మ చాలా నిజాయితీగా, స్పష్టంగా తన అభిప్రాయాన్ని ముక్కుసూటిగా చెబుతుంది. అందుకే నా ‘సిగ్మా’ సినిమా చూసి అమ్మ ఇచ్చే రివ్యూ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అని పేర్కొన్నారు. అలాగే తన చెల్లెలు దివ్య సాషాతో ఉన్న బాండింగ్ గురించి చెబుతూ.. “చిన్నతనంలో మేమిద్దరం టామ్ అండ్ జెర్రీ లా నిత్యం గొడవపడేవాళ్లం. కానీ తను కొంచెం పెద్దయ్యాక మేమిద్దరం చాలా క్లోజ్ అయ్యాం. ఇప్పుడు నేను సినిమాల్లో, తను హైయర్ స్టడీస్‌లో బిజీగా ఉండటం వల్ల రోజూ కలవలేకపోతున్నాం. తను బాస్కెట్‌బాల్ ప్లేయర్” అని చెప్పుకొచ్చారు. తనకు క్రికెట్ అంటే చాలా ఇష్టమని, చెన్నై సూపర్‌కింగ్స్ (CSK) టీమ్‌కు తాను పెద్ద అభిమానని సంజయ్ తెలిపారు. “ఐపీఎల్ మొదటి సీజన్ సమయంలో మా నాన్నగారు చెన్నై సూపర్‌కింగ్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు. ఆ సమయంలో నేను ఎంఎస్ ధోనీతో పాటు ఇతర సిఎస్కే ప్లేయర్లను కలిశాను. ఆ జ్ఞాపకాలు నా జీవితంలో ఎప్పటికీ ప్రత్యేకమైనవి” అని సంజయ్ ఆనందం వ్యక్తం చేశారు.
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!