NTV Telugu Site icon

Janhvi Kapoor: జాన్వీ కపూర్‌కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

Janhvikapoor

Janhvikapoor

బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఫుడ్ పాయిజన్ కారణంగానే జాన్వీ కపూర్ అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఇటీవల అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహంలో గోల్డెన్ డ్రస్‌లో తళుక్కుమని మెరిసింది. సహచర తారాగణంతో ఆడిపాడింది. ఇంతలోనే ఆమె అస్వస్థతకు గురికావడంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

జాన్వీ కపూర్‌కు తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ముంబై ఆస్పత్రిలో చేరినట్లు ఆమె తండ్రి, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ తెలిపారు. ప్రస్తుతం జాన్వీ కోలుకుంటుందని చెప్పారు. కొద్దిరోజుల్లోనే ఆమె డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఆమె ఇటీవలే టాలీవుడ్‌లో  అరంగేట్రం చేసింది. జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాలో నటిస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో ఆమె హీరోయిన్‌గా పని చేస్తోంది. కానీ సినిమా యూనిట్ నుంచి.. ఆమె ఆరోగ్యం గురించి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

Show comments