Site icon NTV Telugu

Janhvi Kapoor: కేవలం గ్లామర్ కాదు, పర్ఫార్మెన్స్ కూడా – కొత్త ట్రాక్‌లో జాన్వీ కపూర్!

Jhanvi Kapoor

Jhanvi Kapoor

జాన్వీ కపూర్‌ ఇప్పుడు గ్లామర్‌తో పాటు పర్ఫార్మెన్స్‌పై కూడా ఫోకస్‌ పెట్టింది. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కొద్ది కాలంలోనే శ్రీదేవి కూతురు అనే ట్యాగ్‌ నుంచి బయటపడి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మొదట్లో రొమాంటిక్‌, ఫ్యామిలీ సినిమాలతోనే లైమ్‌లైట్‌లోకి వచ్చిన జాన్వీ, ఇప్పుడు మాత్రం కొత్త ట్రాక్‌లో నడుస్తోంది. ఇటీవల వచ్చిన పరమ్ సుందరి‌, సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్ద సక్సెస్ సాధించకపోయినా, ఆమె నటన మాత్రం అందరికీ నచ్చింది. కేవలం అందం, గ్లామర్‌కే పరిమితమైపోకుండా, తన యాక్టింగ్‌తో ప్రేక్షకుల మనసు గెలుచుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది జాన్వీ.

Also Read: Renu-desai : ఈసారి కామెడీని నమ్ముకున్న రేణు దేశాయ్..?

ఇప్పుడు ఆమె కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఒక పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాలో నటించేందుకు అంగీకరించింది. టైగర్ ష్రాఫ్, లక్ష్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో జాన్వీ పాత్ర చాలా స్ట్రాంగ్‌గా ఉండబోతోందట. ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ జాన్వీ.. “ఇప్పటివరకు నేను చేసిన పాత్రలు ఎక్కువగా రొమాంటిక్ లేదా ఎమోషనల్ టచ్ ఉన్నవి. కానీ ఈ సినిమా పూర్తిగా వేరు. ఇది యాక్షన్, రివెంజ్, ఇంటెన్స్ డ్రామా మిక్స్ అయిన స్టోరీ. నా క్యారెక్టర్‌లో చాలా పవర్ ఉంది. ఇందులో ఎనర్జీ, ఎమోషనల్ రెండూ బలంగా ఉంటాయి. నేను యాక్టర్‌గా ఇంకా ఎంతవరకు ఎక్స్‌ప్లోర్ చేయగలనో చూపించడానికి ఈ సినిమాకు సైన్ చేశాను” అని ఆమె చెప్పింది. జాన్వీ ఈ మాటలతో చెప్పకనే చెప్పింది ఇక నుంచి కేవలం అందం తోనే కాదు, తన నటనతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే తన టార్గెట్ అని. కొత్త జానర్‌లలో నటిస్తూ, తన కెరీర్‌కి కొత్త దిశ చూపించబోతున్న జాన్వీ కపూర్‌ ఇప్పుడు బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.

Exit mobile version