Jamuna Birthday Special : కళాభినేత్రి జమున!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహానటి జమున పేరు స్ఫురించగానే, ఆ నాటి ఆమె అందాల అభినయం, ఆ పై విలక్షణమైన ఆమె వ్యక్తిత్వం గుర్తుకు వస్తాయి.తెలుగు చిత్రసీమలో ఎక్కువ కాలం నాయికగా నటించిన ఘనతను జమున సొంతం చేసుకున్నారు. తనకంటే వయసులో చిన్నవారి సరసన సైతం హీరోయిన్ గా నటించి మెప్పించారామె. ఇక నాటి మేటి నటులతో జమున తనదైన బాణీ పలికిస్తూ నటించిన తీరును అభిమానులు ఇప్పటికీ మననం చేసుకొని ఆనందిస్తూ ఉంటారు. సత్యభామగా తెరపై ఆమె అభినయించిన తీరు అనితరసాధ్యంగా నిలచింది. ఆమె చిత్రాల ద్వారా పలువురు హీరోలు తమ భవితకు బంగారు బాటలు వేసుకోవడం గమనార్హం!
జమున అసలు పేరు జానా బాయి. కర్ణాటకలోని హంపిలో 1936 ఆగస్టు 30న జన్మించారామె. అయితే గుంటూరు జిల్లా దుగ్గిరాలలో పెరిగారు. అదే సమయంలో సావిత్రి సైతం నాటకాలు వేసేవారు. ఓ సారి అనుకోకుండా దుగ్గిరాలలో సావిత్రి ప్రదర్శన ఇచ్చే సమయంలో జమున వారి ఇంటిలోనే దిగారు. అలా చిత్రసీమకు ముందే సావిత్రిని ‘అక్కా’ అని పిలుస్తూ సాగారు. సావిత్రి స్ఫూర్తితో జమున సైతం నాటకాల్లో నటించడం మొదలెట్టారు. ఆ సమయంలో ప్రఖ్యాత నటులు జగ్గయ్య వీరిద్దరికీ నాటకాల్లో అవకాశాలు కల్పిస్తూ, వాటికి దర్శకత్వం వహించేవారు. డాక్టర్ గరికపాటి రాజారావు ‘పుట్టిల్లు’ చిత్రం ద్వారా జమునను చిత్రసీమకు పరిచయం చేశారు. తొలి చిత్రంలోనే నటిగా మంచి మార్కులు సంపాదించారు జమున.
Also Read
- Ajay Bhupathi: మహేష్ బాబు అలా అడుగుతారని అస్సలు ఊహించలేదు.. 'RX100' తర్వాత ఏం జరిగిందో చెప్పిన అజయ్ భూపతి!
- Ajay Bhupathi: ఆర్జీవీ మేకింగ్ స్టైల్‌కు ప్రత్యేక బ్రాండ్ ఉంది
- Ajay Bhupathi: 'మంగళవారం'లో హీరోయిన్ పాయల్ రాజ్‌ఫుత్ క్యారెక్టర్‌పై డైరెక్టర్ అజయ్ భూపతి షాకింగ్ కామెంట్స్..
- Fauji vs King: బాక్సాఫీస్ వార్.. ప్రభాస్ 'ఫౌజీ' vs షారుఖ్ 'కింగ్'.. వెయ్యి కోట్ల వేటలో విజేత ఎవరు?
జమున నటించిన “దొంగరాముడు, మిస్సమ్మ, చిరంజీవులు, ముద్దుబిడ్డ, భాగ్యరేఖ, భూకైలాస్, ఇల్లరికం, గులేబకావళి కథ, గుండమ్మకథ, బొబ్బిలియుద్ధం, మంచి మనిషి, మూగమనసులు, రాముడు-భీముడు, మంగమ్మ శపథం, దొరికితే దొంగలు, తోడు-నీడ, పూలరంగడు, రాము, మట్టిలో మాణిక్యం, పండంటి కాపురం, తాసిల్లార్ గారి అమ్మాయి, సంసారం, మనుషులంతా ఒక్కటే, ఉండమ్మా బొట్టు పెడతా” వంటి చిత్రాలు జనాన్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. యన్టీఆర్, ఏయన్నార్ ఇద్దరికీ హిట్ పెయిర్ గా సాగారు. ‘ఉండమ్మా బొట్టు పెడతా’ చిత్రంలో కృష్ణ సరసన నటించారు. ఆ సినిమాతో కృష్ణకు ఫ్యామిలీ ఆడియెన్స్ లోనూ మంచి గుర్తింపు లభించింది. ఇక స్టార్ డమ్ కోసం దాదాపు పుష్కరకాలంగా తపిస్తోన్న శోభన్ బాబుకు జమునతో నటించిన ‘తాసిల్దార్ గారి అమ్మాయి’ బ్రేక్ నిచ్చింది. అలాగే హరనాథ్ కు జమునతో నటించిన చిత్రాలే హీరోగా మంచి పేరు సంపాదించి పెట్టాయి. కృష్ణంరాజును రెబల్ స్టార్ గా నిలిపిన ‘కటకటాల రుద్రయ్య’లో జమున కృష్ణంరాజుకు జోడీగా, తల్లిగా నటించారు. ఇలా అనేకమంది స్టార్ హీరోస్ కు విజయనాయికగా అలరించారు జమున.
తెలుగులో జమునతో రూపొందిన అనేక చిత్రాలు తమిళంలో రీమేక్ అయినప్పుడూ ఆ పాత్రల్లో ఆమెనే ఎంపిక చేసుకొనేవారు. అలాగే హిందీలోనూ జమున ” మిస్ మేరీ, మిలన్, హమ్ రాహీ, దుల్హన్” వంటి చిత్రాలలో నటించారు. కొన్ని కన్నడ చిత్రాలలోనూ జమున నటించి మెప్పించారు.
జమున, ప్రొఫెసర్ జూలూరి రమణరావును వివాహం చేసుకున్నారు. వారికి వంశీ, స్రవంతి సంతానం. వంశీ మీడియా ప్రొఫెసర్ గా శాన్ ఫ్రాన్సిస్కోలో పనిచేస్తున్నారు. స్రవంతికి ఓ బాబు. తన కూతురు, మనవడుతో కలసి జమున ప్రస్తుతం హైదరాబాద్ లోనే నివసిస్తున్నారు.
జమునకు ఇందిరాగాంధీ అంటే ఎంతో అభిమానం. ఆ అభిమానంతోనే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1985లో మంగళగిరి అసెంబ్లీకి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. 1989లో రాజమండ్రి లోక్ సభ నియోజకవర్గం నుండి ఎంపీగా ఎన్నికయ్యారు. 1991లో అదే నియోజకవర్గం నుండి ఓటమి చవిచూశారు. ఆ తరువాత కొంతకాలం ఆ పార్టీలోనే కొనసాగినా, ఆపై బీజేపీలో చేరారు. ప్రస్తుతం ప్రశాంతజీవనం సాగిస్తున్నారు.
తాజావార్తలు
-
Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
-
Congress: బంగ్లాదేశ్ ఉదాహరణతో కాంగ్రెస్‌కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రధాని నివాసం ముందు నిరసనపై ఫైర్
-
Rahul Gandhi: రాహుల్‌గాంధీని ఈడ్చుకెళ్లిన పోలీసులు.. ముక్కుకు గాయం?
-
China: కొత్త గేమ్‌కి రెడీ అవుతున్న చైనా.. ప్రపంచానికి షాక్ తప్పదా?
-
Arijit Singh: గూండాల్లా విద్యార్థులపై దాడి చేస్తారా? ఢిల్లీ ఘటనపై ప్రముఖ సింగర్ ధ్వజం
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!