Site icon NTV Telugu

Rajamouli: మన సినిమా గురించి మాట్లాడిన అవతార్ డైరెక్టర్… అదిదా సర్ రేంజ్

Rajamouli

Rajamouli

ఆర్ ఆర్ ఆర్ సినిమా సాదిస్తున్న విజయాల గురించి, ఇండియాకి తెస్తున్న అవార్డుల గురించి ఎన్ని రాసినా, ఎన్ని చెప్పినా తక్కువే కానీ తాజాగా జరిగిన ఈ విషయం మాత్రం ఇప్పటివరకూ జరిగిన అన్నింటికన్నా గొప్పది. ప్రపంచ సినిమా రంగంలోనే బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ క్రియేటర్, బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే ఫిల్మ్ మేకర్ ఎవరైనా ఉన్నారా? అంటే అందరి నుంచి వచ్చే ఒకేఒక్క మాట ‘జేమ్స్ కమరూన్’. టెర్మినేటర్, ర్యాంబో, టైటానిక్, అవతార్ లాంటి లార్జర్ దెన్ లైఫ్ సినిమాలని చెయ్యడంలో జేమ్స్ దిట్ట. థియేటర్ కి వచ్చే ఆడియన్స్ ని ఫుల్ గా సాటిస్ఫై  చెయ్యడంలో జేమ్స్ కమరూన్ ని మించిన డైరెక్టర్ మరొకరు ఈ సినిమా ప్రపంచంలోనే లేరు. నో, నో… ఒకరున్నారు. థియేటర్స్ కి వచ్చి సినిమా చూసే ఆడియన్స్ ని మాత్రమే కాదు ఇంట్లో కూర్చోని ఒటీటీలో సినిమాలు చూసే వాళ్లకి కూడా ఫుల్ మీల్స్ పెట్టగల ఆ దర్శకుడు మన రాజమౌళి. జక్కన్నగా మనం అంతా ప్రేమగా పిలుచుకునే రాజమౌళి, ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్స్ లో ఒకడు మాత్రమే కాదు ఈరోజు ఆయన వరల్డ్స్ బిగ్గెస్ట్ డైరెక్టర్స్ లో ఒకరు.

ఇంఫాక్ట్ చెప్పాలి అంటే జేమ్స్ కమరూన్ తర్వాత ఎమోషన్స్ అండ్ విజువల్ గ్రాండియర్ రెండింటినీ పర్ఫెక్ట్ గా బాలన్స్ చేసి చూపించగల ఏకైక దర్శకుడు రాజమౌళి మాత్రమే. అంతటి రాజమౌళి, జేమ్స్ కమరూన్ లు కలిస్తే ఎలా ఉంటుంది? మన ఆర్ ఆర్ ఆర్ సినిమా గురించి అవతార్ లాంటి మాస్ పీస్ సినిమా తీసిన దర్శకుడు ఏం మాట్లాడి ఉంటారు? ఆయనకి మన విజువల్స్ నచ్చి ఉంటాయా? మన ఎమోషన్స్ ఎక్కి ఉంటాయా? ఇలా చాలా ప్రశ్నలకి సమాధానం. జేమ్స్ కమరూన్ మన ఆర్ ఆర్ ఆర్ సినిమాని చూసారు, ఆయనకి నచ్చింది, దాదాపు 10 నిమిషాల పాటు ఆర్ ఆర్ ఆర్ సినిమా గురించే మాట్లాడారు. జేమ్స్ కమరూన్ చూడడం మాత్రమే కాదు ఆయన తన వైఫ్ ‘సుజీ’ని కూడా ఆర్ ఆర్ ఆర్ సినిమా చూడామణి చెప్పి, సుజీ చూసే సమయంలో జేమ్స్ మళ్లీ రెండో సారి ఆర్ ఆర్ ఆర్ సినిమా చూశారు. ఈ విషయాన్ని మేము చెప్పట్లేదు అండి, రాజమౌళినే స్వయంగా ట్విట్టర్ లో జేమ్స్ కమరూన్ కి కలిసిన ఫోటోలు పోస్ట్ చేసి మరీ చెప్పాడు.

ఒకసారి అటు వైపు ఒక లుక్కేయండి, ఇద్దరు దిగ్గజ దర్శకులు ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తారు. ఆ ఫోటోని చూడగానే ‘అదిదా సార్ రేంజ్’ అని రాజమౌళి గురించి ఎవరైనా అనాల్సిందే. ఇక్కడ చెప్పుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఆర్ ఆర్ ఆర్ సినిమా బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరిలో అవతార్ వే ఆఫ్ వాటర్ సినిమాకి టఫ్ కాంపిటీషన్ ఇచ్చి క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ ఈవెంట్ లో రన్నర్ గా నిలిచింది.

Exit mobile version