Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!

Jailer 2 Pre Release Event

Jailer 2 Pre Release Event

Jailer 2 Pre Release Event: సూపర్‌స్టార్ రజనీకాంత్ – నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘జైలర్ 2’ ప్రమోషన్స్ తెలుగు నాట ఊపందుకున్నాయి. ఫస్ట్ పార్ట్‌కి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో, ఈ సీక్వెల్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ.. సొంత ఇండస్ట్రీ అయిన కోలీవుడ్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను చిత్ర యూనిట్ పూర్తిగా స్కిప్ చేసింది. కానీ తెలుగు మార్కెట్ ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ వేదికగా గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను లాక్ చేశారు.

అక్టోబర్ 12న సాయంత్రం 5 గంటల నుంచి శిల్ప కళావేదికలో ఈ ఈవెంట్ జరగనున్నట్టు వెల్లడించారు. అయితే ఈ గ్రాండ్ ఈవెంట్‌కు సూపర్ స్టార్ రజనీకాంత్ స్వయంగా హాజరవుతారా అని ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఈ వేదికపై అందరి దృష్టి తెలుగు డిస్ట్రిబ్యూటర్, ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ పైనే ఉండనుంది. సినిమాల టికెట్ రేట్ల పెంపు వ్యవహారంపై నాగవంశీ ఏం మాట్లాడుతారు, లేకపోతే ఈ అంశాన్ని ఆయన పూర్తిగా దాటవేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.