Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jailer 2: సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా వచ్చిన ‘జైలర్’ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. తమిళంతో పాటు తెలుగు, కన్నడ మార్కెట్లలో కాసుల వర్షం కురిపించిన ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘జైలర్ 2’ రెడీ అవుతోంది. మొదటి భాగాన్ని మించిన రేంజ్లో సీక్వెల్‌ను నిలబెట్టేందుకు దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ పక్కా ప్లాన్‌తో ఇతర భాషా పరిశ్రమల నుంచి భారీ తారాగణాన్ని రంగంలోకి దించుతున్నారు. అయితే ఈ క్రమంలో సౌత్‌లోనే అతిపెద్ద మార్కెట్ కలిగిన తెలుగు ఇండస్ట్రీని నెల్సన్ లైట్ తీసుకున్నారా అనే చర్చ సినీ వర్గాల్లో జోరుగా మొదలైంది.
ఫస్ట్ పార్ట్‌లో కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, మలయాళ దిగ్గజం మోహన్‌లాల్ స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ఎంతటి ప్లస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు సీక్వెల్ కోసం నెల్సన్ ఆ వ్యూహాన్ని మరింత విస్తరించారు. బాలీవుడ్ నుంచి విద్యాబాలన్, మిథున్ చక్రవర్తిలను తీసుకురావడమే కాకుండా, మలయాళం నుంచి సూరజ్ వెంజరమూడు, కోలీవుడ్ నుంచి ఎస్.జె.సూర్య లాంటి స్టార్లను లైన్లో పెట్టారు. కన్నడ, మలయాళ, హిందీ మార్కెట్లను కొల్లగొట్టేందుకు ఇంతగా కసరత్తు చేస్తున్న నెల్సన్.. తెలుగు విషయానికి వచ్చేసరికి మాత్రం పెద్దగా పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
Also Read
‘జైలర్’ ఫస్ట్ పార్ట్‌లో సునీల్ రోల్, తమన్నా ‘కావాలయ్య’ సాంగ్ తెలుగు ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించడంలో కీలక పాత్ర పోషించాయి. కానీ ‘జైలర్ 2’ కోసం నెల్సన్ వేసిన ప్లాన్లలో టాలీవుడ్ నుంచి చెప్పుకోదగ్గ స్టార్ రోల్స్ ఏవీ కనిపించడం లేదు. రజనీకాంత్‌కు తెలుగులో ఉన్న తిరుగులేని మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని, ఇక్కడ ప్రత్యేకంగా ఎవరినీ పెట్టకపోయినా వసూళ్లు వాటంతట అవే వస్తాయనే ఓవర్ కాన్ఫిడెన్స్ తోనే నెల్సన్ టాలీవుడ్‌ను పక్కనపెట్టారా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇతర ఇండస్ట్రీల స్టార్లను భారీగా దించుతూ తెలుగును మాత్రం లైట్ తీసుకోవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరి టాలీవుడ్ స్టార్స్ లేకుండానే నెల్సన్ వేస్తున్న ఈ వ్యూహం తెలుగు బాక్సాఫీస్ వద్ద ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఎల్ నినో ముప్పుపై అప్రమత్తంగా ఉండాలి.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
-
AP Alliance Seat Sharing: టీడీపీ, జనసేన, బీజేపీ పోటీ చేసే స్థానాలపై క్లారిటీ.. అధికారిక ప్రకటన ఎప్పుడంటే?
-
Kawasaki Z300 India Launch: Kawasaki Z300 భారత్‌లోకి.. ధర ఎంత? 296cc ఇంజిన్, ఫీచర్లు, లాంచ్ డేట్ వివరాలు!
-
Nithiin: ‘అలియాస్ రుక్మిణి’తోనైనా నితిన్ లెక్క సరిచేస్తాడా?
-
Special Summary Revision: SIR వివాదం మధ్య ఈసీ కీలక నిర్ణయం.. 17 రాష్ట్రాల్లో ఓటరు జాబితాల సవరణకు ఆదేశాలు!
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!