యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, శృతి హాసన్ జంటగా నటిస్తున్న యాక్షన్ డ్రామా “సలార్”. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగండూర్ నిర్మించారు. కన్నడ, తెలుగు భాషలలో ఏకకాలంలో చిత్రీకరించబడిన ఈ చిత్రం హిందీ, తమిళం, మలయాళంలో కూడా డబ్ చేయబడుతుంది. రవి బస్రూర్ సంగీతం సమకూర్చగా, సినిమాటోగ్రఫీ భువన్ గౌడ నిర్వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ “కెజిఎఫ్” ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. భారీ గ్యాంగ్ స్టర్ మూవీ “సలార్”లో ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో విన్పిస్తున్న తాజా బజ్ ప్రకారం ప్రముఖ నటుడు జగపతిబాబు “సలార్”లో కీలక పాత్రలో కనిపించనున్నాడు.
Read Also : పవన్ బర్త్ డే రోజు “భీమ్లా నాయక్” స్పెషల్ ట్రీట్
ఈ సినిమాలో నటించడానికి ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన ఆయన ఇటీవలే మూవీ సెట్స్ లో కూడా చేరినట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీలో జగ్గూభాయ్ ఏ పాత్రలో కనిపించబోతున్నాడు అనే క్లారిటీ లేదు. దీంతో ఆ విషయంపై అందరిలో ఆసక్తి మొదలైంది. కొన్ని రోజుల క్రితం విలన్ కోసం ప్రత్యేకంగా ఓ భారీ సెట్ ను నిర్మిస్తున్నట్టుగా, త్వరలోనే విలన్ షూటింగ్ లో జాయిన్ అవుతాడంటూ వార్తలు వచ్చాయి. ఆ వార్తలను బట్టి చూస్తే “సలార్ ” విలన్ అతనేనా ? అనే అనుమానం వస్తోంది. అయితే సినిమాలో విలన్ విషయాన్ని మేకర్స్ సస్పెన్స్ లో ఉంచారు. “సలార్” 2022 వేసవి కానుకగా 14 ఏప్రిల్ న థియేటర్లలో భారీ ఎత్తున రిలీజ్ కానుంది.