Jagapathi Babu: విలక్షణ నటుడు జగపతిబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా మహిళలకు దగ్గరైన ఈ హీరో ప్రస్తుతం విలన్ గా, సపోర్టివ్ రోల్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ప్రస్తుతం ఏ స్టార్ హీరో సినిమా అయినా సరే జగపతిబాబు ఉండడం కామన్ గా మారిపోయింది. మొదటి నుంచి కూడా జగపతిబాబుకి ముక్కు సూటితనం ఎక్కువ. మనసులో ఏది అనిపిస్తే అది నిర్మోహమాటంగా ముఖం మీద చెప్పేస్తాడు. దీనివల్ల ఆయన ఎన్నో వివాదాలను, అవమానాలను ఎదుర్కోవాల్సి వచ్చిందని ఎన్నోసార్లు ఇంటర్వ్యూలో చెప్కొచ్చాడు. ఇక సినిమాల విషయం పక్కన పెడితే సోషల్ మీడియాలో జగపతిబాబు నిత్యం యాక్టివ్ గా ఉంటూ ఉంటాడు. తనకు నచ్చిన వంటలు, విదేశాల్లో తిరిగిన వీధులు, తన ఫ్యాషన్ కు సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటాడు. ఇకపోతే నేడు జగపతిబాబు పుట్టినరోజు. నేడు ఆయన 62 వ పడిలోకి అడుగుపెడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ఆయనకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇకపోతే జగపతిబాబు తన పుట్టినరోజున ఒక ఫోటోను షేర్ చేస్తూ.. అద్భుతమైన క్యాప్షన్ రాసుకొచ్చాడు. ఒక చేతిలో పాలసీసా.. ఇంకో చేతిలో విస్కీ బాటిల్ పట్టుకొని.. “ఎలాగోలా పుట్టేశాను. సిగ్గు లేకుండా అడుగుతున్నా, మీ అందరి ఆశీస్సులు నాకు కావాలి.. రెండోది, ఆలోచించకుండా త్వరగా డిసైడ్ చెయ్యండి ఈ రెండిట్లో ఏది కొట్టమంటారు..? ” అంటూ రాసుకొచ్చాడు. ఇక అభిమానులు సైతం జగ్గూభాయ్ లానే తమదైన రీతిలో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకొస్తున్నారు. చిన్నప్పుడు పాలే కదా తాగారు.. ఇప్పుడు విస్కీ కొట్టి బర్త్ డే ను ఎంజాయ్ చేయండి అని కొందరు.. పాలు తాగండి అని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.
Elagola Putteysanu. siggu lekunda adugutuna, mee andari ashishulu naku kaavali.. Rendodhi, alochinchakunda quick ga decide cheyandi ee renditlo edhi kotamantaru? pic.twitter.com/k8FaHEq4KG
— Jaggu Bhai (@IamJagguBhai) February 12, 2024