Jagapati Babu : సినీ నటుడు జగపతి బాబు అనూహ్యంగా ఈడీ విచారణకు హాజరయ్యారు. చడీ చప్పుడు లేకుండా ఆయన ఇలా హాజరు కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే జగపతి బాబుపై ఎలాంటి గతంలో కేసులు లేవు. తాజాగా సాహితి ఇన్ఫ్రా కేసులో ఈడీ ఎదుట జగపతిబాబు హాజరయ్యారు. ఈ కేసులో నాలుగు గంటల పాటు జగపతిబాబును ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈ కంపెనీ యాడ్స్ లలో జగపతి బాబు గతంలో నటించారు. కాబట్టి ఆ సంస్థ నుంచి జగపతిబాబుకు డబ్బుఎలా వచ్చింది, దాన్ని ఏం చేశారు అనే వాటిపై అధికారులు ప్రశ్నించారు.
Read Also : Rithu Chowdary : ఎంతమందితో ఎఫైర్ పెట్టుకుందో.. రీతూపై గౌతమి ఆరోపణలు
ఫ్రీ లాంచ్ ఆఫర్ పేరుతో సాహితి ఇన్ ఫ్రా కంపెనీ కస్టమర్లను నిండా ముంచిన సంగతి తెఇసిందే. సాహితీ ఇన్ ఫ్రా ఫ్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో 700 మంది కస్టమర్ల నుంచి రూ.800 కోట్లు వసూలు చేసింది. ఆ డబ్బు మొత్తాన్ని షెల్ కంపెనీలకు తరలించిందని ఈడీ గుర్తించింది. సాహితీ ఇన్ ఫ్రా సంస్థ రూ.126 కోట్లతో 21 ప్రాపర్టీలను కొనేసిందని అధికారులు గతంలోనే అనౌన్స్ చేశారు. ఈ సంస్థ ఫ్రాడ్ కేసులో రూ.161 కోట్ల రూపాయల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది విషయం తెలిసిందే. కాగా ఈ వియయంపై జగపతి బాబు ఏమైనా స్పందిస్తారా లేదా అనేది చూడాలి.
Read Also : OG: ఓజీ మూవీ ప్రీమియర్స్‌లో..స్క్రీన్‌ను చింపి అభిమానుల రచ్చ..
