పవర్ శస్టార్ పవన్ కళ్యాణ్ – క్రిష్ కాంబోలో వస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతామ్ శరవేగంగా షూటిం జి జరుపుకొంటుంది. ఈ సినిమాలో పవన్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నిధి అగర్వాల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికి నిధి అగర్వాల్ షూటింగ్ చివరి దశకు రాగా జాక్వెలిన్ త్వరలోనే సెట్స్ లో అడుగుపెట్టనుంది. ఇక ఈ నేపథ్యంలోనే చిత్ర బృందానికి షాక్ తగిలింది.
జాక్వెలిన్, మనీ లాండరింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరు కావడం, ఆమెను వారు అదుపులోకి తీసుకోవడం చకచకా జరిగిపోయాయి. త్వరలోనే ఆమెను అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయంటూ వార్తలు రావడంతో చిత్ర బృందం పునరాలోచనలో పడింది.. ఆమెను అరెస్ట్ చేస్తే ఎప్పుడు రిలీజ్ చేస్తారో.. అసలు రిలీజ్ చేస్తారా అనేది తెలియదు కాబట్టి రిస్క్ తీసుకోవడం కష్టమైన పనిగా భావించిన క్రిష్ జాక్వెలిన్ ని సినిమా ముక్కుని తొలగించినట్లు సమాచారం.
ఇక ఆమె ప్లేస్ లో బాలీవుడ్ ముద్దుగుమ్మనర్గీస్ ఫక్రీ ని తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఎప్పటినుంచో నర్గీస్ టాలీవుడ్ పై కన్ను వేసి ఉంచింది. దీంతో క్రిష్ బృందం అడిగిన వెంటనే ఓకే అనేసిందని వార్తలు గుప్పుమంటున్నాయి. మరి ఈ వార్తలో నిజమెంతో తెలియదు కానీ ఒకవేళ ఇదే కనుక నిజమైతే హరిహర వీరమల్లు ఇంకొద్దిగా ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. మరి ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే చిత్ర బృందం నోరువిప్పాల్సిందే.
