NTV Telugu Site icon

Jabardasth Praveen: ఫైమాను మోసం చేసి మరో అమ్మాయిని పెళ్లాడిన ప్రవీణ్

Faima

Faima

Jabardasth Praveen: బుల్లితెర కామెడీ షో ఎంతోమంది కళాకారులకు జీవితాన్ని ఇచ్చింది. జబర్దస్త్ కు వచ్చి ఏళ్లు గడుస్తున్నా కొంతమంది నటులకు గుర్తింపు రాలేదు.. కానీ, వచ్చిన కొన్ని నెలలకే మంచి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్స్ ఎవరు అంటే.. హైపర్ ఆది. ఇతగాడి తరువాత ఇమ్మాన్యుయేల్.. ఇక వీరి లిస్ట్ లోకి చేరిపోయాడు ప్రవీణ్. మొదట అందరి టీమ్స్ లో కంటెస్టెంట్ గా చేసి.. తనదైన పంచ్ లతో మెప్పించి ప్రస్తుతం పటాస్ ప్రవీణ్ అనే టీమ్ కు లీడర్ గా మారిపోయాడు. ఇక ఈ జబర్దస్త్ స్టేజి మీదనే ఫైమాతో ప్రేమలో పడటం, ఆమెను పెళ్లి చేసుకుంటాను అని చెప్పడం జరిగాయి. ఇక ఇది కూడా స్కిట్ లో భాగంగానే జరిగింది అనేది తెలియదు. ఆ తరువాత ఫైమా బిగ్ బాస్ కు వెళ్ళింది. బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చాకా వీరిద్దరూ కలిసి కనిపించింది లేదు. అయితే తాజాగా పటాస్ ప్రవీణ్ పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చాడు. వేరే అమ్మాయితో ప్రవీణ్ పెళ్లి తానే చేసినట్లు కొమరక్క తన సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చింది.

Ram Charan: నాన్న నాలుగు సినిమాలు చేస్తున్నారు.. నోరుజారిన చరణ్

ప్రవీణ్, వేరొక అమ్మాయి పెళ్లి బట్టల్లో ఉండగా మధ్యలో కొమరక్క వారిద్దరిని పట్టుకొని ఫోటోలకు పోజు ఇచ్చింది. దీంతో ఫైమాను మోసం చేసి ప్రవీణ్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అంటూ అభిమానులు ప్రవీణ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీంతో ఈ పెళ్లిపై ప్రవీణ్ స్పందించాడు. అది ఒరిజినల్ పెళ్లి కాదని, కొమరక్క యూట్యూబ్ కోసం ఈ పెళ్లి వీడియో చేశామని, ఈ వీడియో అందరికి నవ్వు తెప్పిస్తుందని చెప్పుకొచ్చాడు. దీంతో అభిమానులు చల్లబడ్డారు. అంతేకాకుండా ఫైమా తో పెళ్లి ఎప్పుడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే బిగ్ బాస్ నుంచి వచ్చాకా ఫైమా జబర్దస్త్ లో కనిపించలేదు. వేరే ఛానెల్స్ లో షోస్ చేస్తుంది. మరి వీరి పెళ్లి జరుగుతుందా..? లేదా అనేది కాలమే నిర్ణయించాలి.

Show comments