నేడు (ఏప్రిల్ 16) విలక్షణ నటుడు జేడీ చక్రవర్తి పుట్టినరోజు. గత కొన్నేళ్లుగా సినీ ఇండస్ట్రీలో క్రియాశీల నటుడిగా వెలుగొందుతున్న జేడీ చక్రవర్తి ప్రస్తుతం తెలుగు పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళీ భాషల్లో డిఫరెంట్ మూవీస్ చేస్తూ బిజీగా ఉన్నారు. హిందీలో ‘ఏక్ విలన్ పార్ట్- 2’, ఆయుష్మాన్ ఖురానాతో కొత్త సినిమా, ‘దహిని’తో పాటు మరో థ్రిల్లర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ కాలేదు. సోని, ప్రైమ్ కలిసి నిర్మిస్తున్న ఓ హిందీ వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తున్నారు.
తమిళ్లో సింగం ఫిలిం ప్రొడక్షన్ వారి ప్రతిష్టాత్మక సినిమా ‘కర్రీ’లో కీలక పాత్రలో నటిస్తున్నారు జెడీ చక్రవర్తి. ఈ సినిమాలో శశి కుమార్ హీరోగా నటిస్తున్నారు. అలాగే ‘పట్టరాయ్’ అనే మరో తమిళ సినిమాలో భాగమవుతున్నారు.
ఇకపోతే ప్రస్తుతం కన్నడలో రెండు సినిమాల్లో జెడీ చక్రవర్తి నటిస్తున్నారు. అందులో ఒకటి జోగి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ప్రేమ్’ కాగా మరొకటి థ్రిల్లర్ కాన్సెప్ట్ మూవీ ‘WHO’. తెలుగులో మాంగో ప్రొడక్షన్స్ వారితో ‘బ్రేకింగ్ న్యూస్’, JK క్రియేషన్స్ బ్యానర్‌పై ‘ది కేస్’ సినిమా చేస్తున్నారు. అలాగే మలయాళంలో రెండు డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాకు కమిటై ఉన్నారు. పలు భాషల్లో జెడీ చక్రవర్తి చేస్తున్న సినిమాల ప్రవాహం చూస్తుంటే ఇండియా వైడ్ మరోసారి ఆయన పేరు మారుమ్రోగేలా ఉంది.