Site icon NTV Telugu

Tollywood : మిడ్ రేంజ్ హీరోలు మేల్కోవాల్సిన టైమ్ వచ్చింది.. లేకుంటే అంతే సంగతులు

Tollywood (1)

Tollywood (1)

టాలీవుడ్ లో ఉన్నంత మంది హీరోలు మరే ఇతర ఇండస్ట్రీలో లేరు. వారిలో కూడా టైర్ 1 హీరోల కంటే టైర్ 2 హీరోలు మన వద్ద చాలా మంది ఉన్నారు. వీరికి స్టాండర్డ్ ఫ్యాన్ బేస్ కొంత వరకు ఉంటుంది కానీ సినిమా టాక్ తేడా వస్తే మాట్ని షో నుండి థియేటర్స్ ఖాళీగా దర్శనమిస్తాయి. గతంలో ఏడాదికి నాలుగైదు సినిమాలు చేసే మిడ్ రేంజ్ హీరోలు ఇప్పుడు ఏడాదికి ఒకటి లేదా రెండు మాత్రమే చేస్తున్నారు. పోనీ వాటితో ఏమైనా హిట్ కొడుతున్నారా అంటే అది లేదు.

Also Read : Akhanda2 : అఖండ 2.. ఒక్క టికెట్ ధర రూ. 2 లక్షలు.. ఎక్కడంటే?

ఇటివల మిడ్ రేంజ్ హీరోల నుండి వస్తున్న సినిమాలు అవి కలెక్ట్ చేస్తున్న కలెక్షన్స్ చూస్తుంటే మిడ్ రేంజ్ స్టార్లు మేల్కోవాల్సిన టైమ్ వచ్చింది.  పదే పదే నాసిరకం స్క్రిప్ట్ లు ఎంచుకోవడం వల్ల ప్రేక్షకులకు వారిపై నమ్మకం పోతుందని మంచి సినిమాలు చేసిన కూడా ఆడియెన్స్ థియేటర్స్ వైపు అడుగులు వేయరని యువ మరియు మిడ్ రేంజ్ హీరోలు గ్రహించాల్సిన సమయం వచ్చింది. వరుసగా నాలుగు లేదా ఐదు ప్లాప్ సినిమాలు చేసిన తర్వాత, మంచి సినిమా చేసిన కూడా ప్రేక్షకులు రావడం లేదు  అందుకు ఉదారహరణ రామ్ పోతినేని నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా. వరుస భారీ డిజాస్టర్ సినిమాలు చేసిన రామ్ ఇప్పుడు ఒక మంచి సినిమా చేసిన కూడా కలెక్షన్స్ అంతంత మాత్రంగానే ఉన్నాయి. మరి ఆ హీరో చేసిన గత సినిమాలు అనుభవం అలాంటిది మరి. ఇది కేవలం ఒక ఉదరహరణ మాత్రమే. దాదాపు మిడ్ రేంజ్ హెరాలందిరిది ఇదే పరిస్థితి.  ఇక మిడ్ రేంజ్ హీరోలు తెలుసుకోవాల్సిందే ఇంకొకటి సినిమాకు సినిమాకు మధ్య 1.5 సంవత్సరాల గ్యాప్ తీసుకోవడం కూడా వారు కెరీర్‌లో ఈ దశలో వారు చేసే అతి చేస్తున్నపెద్ద తప్పు. మిడ్ రేంజ్ హీరోలు ఇక నుండైనా కంబినేషన్స్ పై కాకుండా కథలపై ద్రుష్టి పెట్టి వరుసగా సినిమాలు చేస్తే వారి కెరీర్ కు మంచిది.

Exit mobile version