మెగా బ్రాండ్‌తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నాగబాబు కొడుకు వరుణ్ తేజ్. అయితే అందరి హీరోల్లా కాకుండా కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తే.. రియాల్టీకి దగ్గర ఉండే సినిమాలు చేస్తూ.. హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు వరుణ్. ముకుంద సినిమాతో హీరోగా అడుగుపెట్టిన వరుణ్.. ఆ తర్వాత క్రిష్ డైరెక్షన్లో వచ్చిన ‘కంచె’ సినిమాతో అదరగొట్టాడు. ఇక ఆ తర్వాత కమర్షియల్ సినిమాలతో పాటు వైవిధ్యంగా సినమాలు చేస్తూ వచ్చాడు. చివరగా గద్దలకొండ గణేష్ సినిమాలో నెగెటివ్ టచ్ ఇచ్చి.. యాక్టింగ్ పరంగా పీక్స్ స్టేజ్‌కు వెళ్లిపోయాడు. ఈ సినిమా తర్వాతే వరుణ్ రేసులో వెనకబడిపోయాడు. కెరీర్ స్టార్టింగ్ నుంచి కంటెంట్‌ను నమ్ముకున్న వరుణ్ తేజ్.. ‘గని’ సినిమా నుంచి రొటీన్ సినిమాల వైపు మొగ్గు చూపుతున్నాడు. గని డిజాస్టర్ అయినప్పటికీ… ప్రవీణ్ సత్తారుని నమ్మి స్పై థ్రిల్లర్‌గా ‘గాండీవధారి అర్జున’ సినిమా చేశాడు. ఈ వారం థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా నెగెటివ్ టాక్ సొంతం చేసుకుంది.
అసలు ఈ సినిమా థియేటర్లో ఉందనే మినిమం బజ్ కూడా లేదు. ఎంతలా అంటే… రిలీజ్ అయిన రోజే ఈ సినిమా ఓటిటి డేట్ కూడా లాక్ అయినట్టుగా వార్తలొస్తున్నాయి. గాండీవధారి అర్జున ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటిటి సంస్థ నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా థియేటర్ టాక్ తేడా కొట్టడంతో.. మూడు వారాల్లోనే ఓటిటిలోకి రానుందని తెలుస్తోంది. వినాయక చవితి సదర్భంగా.. సెప్టెంబర్ 19న ‘గాండీవధారి అర్జున’ ఓటీటీలో వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఈ లెక్కన వరుణ్ తేజ్ సినిమా పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా వరుణ్ బాబు కంటెంట్ ఉన్న కథలపై ఫోకస్ చేస్తే బెటర్ ఏమో. అయితే.. నెక్స్ట్ వచ్చే సినిమాలు మాత్రం విభిన్న కథలతోనే రాబోతున్నాయి. ‘ఆపరేషన్ వాలైంటైన్’ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్లో వస్తుండగా… ‘మట్కా’ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోంది. మరి ఈ సినిమాలతో వరుణ్ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.