NTV Telugu Site icon

Sai Dharam Tej: ఆ ఒక్కటి మిగిలింది… కానీ అంతా అయిపొయింది…

Virupaksha

Virupaksha

మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విరూపాక్ష’. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి సుకుమార్ కథని అందించడం విశేషం. ‘మూడనమ్మకాల’ చుట్టూ తిరుగనున్న ఈ మూవీ టీజర్ ని ఇటివలే పవన్ కళ్యాణ్ లాంచ్ చేశాడు. ఎన్టీఆర్ తో గ్లిమ్ప్స్, పవన్ కళ్యాణ్ తో టీజర్ లాంచ్ చేయించడంతో విరూపాక్ష సినిమాకి మంచి రీచ్ వచ్చింది. దీన్ని కాపాడుకుంటూ ప్రమోషన్స్ చేస్తే చాలు సాయి ధరమ్ తేజ్ అకౌంట్ తో మంచి హిట్ పడినట్లే అవుతుంది. కాంతార ఫేమ్ అజ్నీష్ లోకనాథ్ మ్యూజిక్ విరూపాక్ష సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్ గా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ‘సంయుక్తా మీనన్’ హీరోయిన్ గా నటిస్తున్న ‘విరూపాక్ష’ మూవీని 2023 ఏప్రిల్ 21న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. షూటింగ్ పార్ట్ ని కంప్లీట్ అవ్వడంతో సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియాలో చిత్ర యూనిట్ తో దిగిన ఫోటోని పోస్ట్ చేశాడు.

షూటింగ్ కంప్లీట్ అయ్యింది కానీ ఒక సాంగ్ పెండింగ్ ఉందని సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేశాడు. విరూపాక్ష రిలీజ్ కి ఇంకా మూడు వారాల సమయం మాత్రమే ఉంది కాబట్టి చిత్ర యూనిట్ ఇకపై ప్రమోషన్స్ స్పీడ్ పెంచాల్సిన అవసరం ఉంది. గ్లిమ్ప్స్, టీజర్ లకి స్టార్ హీరోలని వాడినట్లే ట్రైలర్ లాంచ్ అండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లకి కూడా స్టార్ హీరోస్ సపోర్ట్ తీసుకుంటే విరూపాక్ష సినిమాకి రీచ్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది. ఆ తర్వాత తేజ్ పాన్ ఇండియా మొత్తం తిరిగి విరూపాక్ష సినిమాని ప్రమోట్ చెయ్యాల్సి ఉంటుంది, అప్పుడు కానీ ఓపెనింగ్స్ సాలిడ్ గా ఉండవు. మరి యూనివర్సల్ అప్పీల్ ఉండే థ్రిల్లర్ కథతో తెలుగు , తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సినిమాతో ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి.

Show comments