Iswarya Menon : స్పై సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఐశ్వర్య మీనన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిఖిల్ హీరోగా గ్యారీ బీహెచ్ దర్శకత్వంలోవస్తున్న సినిమా స్పై. ఈ సినిమాను కె. రాజశేఖర్‌రెడ్డి నిర్మించిన విషయం తెలిసిందే ఈ చిత్రంను ఈ నెల 29న విడుదల చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్ గా ఐశ్వర్య మీనన్ నటించారు.ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో చిత్ర కథానాయిక ఐశ్వర్యా మీనన్ మాట్లాడుతూ ఈ సినిమా లో ని తన క్యారెక్టర్ పై ఈ భామ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ…ఒక నటిగా నా కెరీర్ పట్ల నేను చాలా సంతృప్తిగా ఉన్నాను. నేను హీరోయిన్ అవుతానని అస్సలు అనుకోలేదు.. నేను ఒక ఇంజనీర్‌ని నా బ్రదర్ ఒక డాక్టర్.కెరీర్ మొదటిలో నేను కొన్ని యాడ్స్ లో నటించాను ఆ తర్వాత ఒక్కో అడుగు వేస్తూ ఇప్పుడు హీరోయిన్‌గా మారాను.. ఈ ప్రయాణం నాకు ఆనందంగా ఉంది” అని చెప్పుకొచ్చింది ఐశ్వర్యా మీనన్.
తెలుగులో హీరోయిన్‌గా నేను చేసిన మొదటి చిత్రం ‘స్పై’. ఈ చిత్రంలో నా క్యారెక్టర్‌లో ఎన్నో షేడ్స్ ఉన్నాయి. ‘రా’ ఏజెంట్‌గా అయితే కనిపిస్తాను. ఈ సినిమాలోని కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం నేను ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నాను. గన్‌ను సరిగ్గా పట్టుకోవడం అలాగే గన్ షూటింగ్ నేర్చుకోవడం వంటి కొత్త విషయాలను నేను నేర్చుకున్నాను.యాక్షన్ సన్నివేశాల్లో కూడా నేను బాగా నటించగలననే విషయం నాకు ‘స్పై’తో తెలిసింది.. యాక్షన్ సినిమాలు కూడా చేయగలననే కాన్ఫిడెన్స్ కూడా నాలో పెరిగింది. ఇక స్వాతంత్య్ర సమరయోధుడు అయిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి మరణ రహస్యాల ఆధారంగా అనేది ఈ సినిమా బేస్‌లైన్ మాత్రమే అని ఇందులో డ్రామా మాత్రం వేరుగా ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు. గ్యారీగారు ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రకు ముందుగా నన్నే అనుకున్నారని ఆమె చెప్పుకొచ్చింది.దీంతో ఆయన స్ట్రయిట్‌గా వచ్చి నాకు కథను చెప్పారు. నేను చూసిన మొదటి తెలుగు సినిమా ‘హ్యాపీ డేస్’. అలాగే నిఖిల్ చేసిన ‘స్వామి రారా’మరియు ‘కార్తికేయ’ చిత్రాలు కూడా నేను చూశాను. ఆయన ప్రతి సినిమాను కూడా నేను ఫాలో అవుతుంటాను. యూవీ క్రియేషన్స్‌లో కార్తికేయ హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో కూడా నేను హీరోయిన్‌గా నటిస్తున్నాను అంటూ ఆమె చెప్పుకొచ్చింది. స్పై సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 27 న జరగనున్నట్లు సమాచారం.
Also Read
తాజావార్తలు
-
Kitchen Sink Tips: గిన్నెలు తోమేటప్పుడు బట్టలు తడుస్తున్నాయా? రూపాయి ఖర్చు లేకుండా ఈ 5 ట్రిక్స్ ట్రై చేయండి
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
AA 23 : అల్లు అర్జున్ – లోకేష్ కనకరాజ్ సినిమా క్యాన్సిల్?
-
Ola Electric Rights Issue: ఓలా ఎలక్ట్రిక్ రైట్స్ ఇష్యూ.. రూ.27కే షేర్లు.. రికార్డ్ డేట్, ప్రారంభ తేదీ వివరాలు ఇవే
-
UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
ట్రెండింగ్
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!