Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి బర్త్ డేకు కొన్ని సినిమా అప్డేట్లు వచ్చాయి. విశ్వంభర నుంచి గ్లింప్స్, మెగా 157 నుంచి టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. అలాగే డైరెక్టర్ బాబీతో ఓ సినిమాను ప్రకటించారు. కానీ శ్రీకాంత్ ఓదెలతో మాత్రం సినిమా అప్డేట్ రాలేదు. వాస్తవానికి వీరిద్దరి మధ్య ఎప్పుడో సినిమా కన్ఫర్మ్ అయింది. అనిల్ రావిపూడి సినిమా తర్వాత కచ్చితంగా శ్రీకాంత్ సినిమానే ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ మెగా 158సినిమాగా బాబీ మూవీని అనౌన్స్ చేశారు. కానీ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో హీరో నాని నిర్మాణంలో మూవీ గురించి ఒక్కటంటే ఒక్క అప్డేట్ కూడా రాలేదు. సినిమా నెంబర్ అయినా ప్రకటిస్తారేమో అనుకుంటే అది కూడా లేదు.
Read Also : Mahavatar Narsimha : కూలీ, వార్-2లను తొక్కి పడేసిన ’మహావతార్ నరసింహా’
ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో నాని హీరోగా ది ప్యారడైజ్ మూవీ వస్తోంది. అది మార్చి 26 2026న వస్తోంది. కాబట్టి ఈ సినిమా అయిపోయిన తర్వాతనే చిరంజీవితో మూవీ ఉండొచ్చు. విశ్వంభర కూడా సమ్మర్ లోనే రాబోతోంది. దాని తర్వాత బాబీతో మూవీ ఉంటుంది. అది అయిపోవడానికి ఎంత లేదన్నా రెండేళ్లు పడుతుంది. అంటే 2028లో బాబీ మూవీ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. చూస్తుంటే 2029లో నాని, చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల కాంబోలో సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలా కాకుండా బాబీ 2026 ఎండింగ్ లోపు సినిమాను కంప్లీట్ చేస్తే.. అదే సినిమాతో శ్రీకాంత్ ఓదెల సినిమాను కూడా చిరు కంప్లీట్ చేయగలిగితే రెండు సినిమాలు 2028లోనే వచ్చే అవకాశాలు ఉంటాయి.
Read Also : Chiranjeevi – Pawan Kalyan : అప్పుడు పవన్ కల్యాణ్.. ఇప్పుడు చిరంజీవి.. అదే సీన్ రిపీట్..
