కాజల్ బేబీ బంప్… లేటెస్ట్ పోస్ట్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొన్ని రోజులుగా కాజల్ అగర్వాల్ ప్రెగ్నెన్సీ అంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై కాజల్ ఇప్పటి వరకూ స్పందించలేదు. కానీ ఈ రూమర్స్ కు తోడుగా కాజల్ ఇటీవల కొన్ని సినిమాల్లో నుంచి తప్పుకుందంటూ పుకార్లు రావడం… కాజల్ ప్రెగ్నెన్సీ అన్న వార్తలకు బలం చేకూర్చాయి. తాజాగా కాజల్ ఫ్రెండ్స్ తో కలిసి ఔటింగ్ కు వెళ్లగా, అక్కడ లంచ్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోలు కాస్తా వైరల్ కాగా అందులో కాజల్ బేబీ బంప్ కన్పించింది అంటున్నారు నెటిజన్లు. కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లు జంట ప్రెగ్నెన్సీ వార్తలపై ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ఈ పుకార్లపై కాజల్ సరైన సమయంలో మాట్లాడతానని చెప్పింది.
కాజల్ అగర్వాల్ సినిమాల విషయానికొస్తే… మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన “ఆచార్య”లో హీరోయిన్ గా నటించింది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే అతిధి పాత్రలో నటించింది. “ఆచార్య” మూవీ 2022 ఫిబ్రవరి 4న థియేటర్లలో విడుదల కానుంది. దుల్కర్ సల్మాన్, అదితి రావ్ హైదరీ నటించిన “హే సినామిక”లో కూడా కాజల్ కనిపించబోతోంది. మేకర్స్ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ డిసెంబర్ 21న విడుదల కానుంది. ఇంకా కాజల్ కిట్టిలో రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కాజల్ ప్రెగ్నెంట్ గా ఉండటంతో కొన్ని ప్రాజెక్ట్ ల నుంచి తప్పుకుందని అంటున్నారు.
Also Read
- Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
- Bollywood : సూపర్ హీరో కథలపై బాలీవుడ్ స్టార్ హీరోస్ మోజు
- Movies Without Trailers: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి వచ్చిన సినిమాలు ఇవే.. లిస్ట్‌లో నాని కొత్త సినిమా!
- Family Pack First Look: సంక్రాంతి బరిలో శ్రీ విష్ణు కొత్త సినిమా.. ఫన్నీగా ‘ఫ్యామిలీ ప్యాక్’ టైటిల్

తాజావార్తలు
-
Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
-
Sanju Samson: సంజు శాంసన్.. ముందుంది ముసళ్ల పండగ! అంతా నీచేతుల్లోనే ఇగ!
-
CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
-
Oppo Find X10: ఒప్పో Find X10 సిరీస్‌లో మూడు మోడల్స్.. గ్లోబల్ లాంచ్‌కు సిద్ధం.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ
-
Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!