NTV Telugu Site icon

Director : ఆ డైరెక్టర్ ది కాన్ఫిడెన్సా లేక ఓవర్ కాన్ఫిడెన్సా

Rabbinhood

Rabbinhood

తాము నటించిన సినిమాల పట్ల హీరోలకు లేదా దర్శకులకు నమ్మకం లేదా కాన్ఫిడెంట్ ఉండడం సహజం. కొందరు హీరోలు ఒకడుగు ముందుకేసి తమ సినిమాకు సంబంధించి ఎదో ఒక ఏరియాకు సంబంధించి థియేట్రికల్ రైట్స్ కొనుగోలు చేస్తుంటారు. మరికొందరు వారు నటించే సినిమా ఖచ్చింతంగా హిట్ అవుతుంది అనుకుంటే రెమ్యునరేషన్ కు బదులు ఓ ఏరియా రైట్స్ కూడా తీసుకుంటారు.  అలా కొనుగోలు చేసి తీరా సినిమా రిలీజ్ అయ్యాక డిజిస్టార్ ఫలితాలను అనుకున్న వారు లేకపోలేదు. డీల్ ఏదైనా సరే అది కంటెంట్ పట్ల వారికున్న నమ్మకం.
Also Read : NEEK : జాబిలమ్మ నీకు అంత కోపమా ఓటీటీ రిలీజ్ లాక్
అయితే తాజాగా మరో యంగ్ డైరెక్టర్ తాను డైరెక్టర్ చేసిన సినిమాకు సంబందించి ఓ ఏరియా రైట్స్ కొనుగులు చేసాడు. యంగ్ హీరో నితిన్ హీరోగా వెంకీ కుడుముల డైరెక్షన్ లో వస్తున్న చిత్రం రాబిన్ హుడ్. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన భీష్మ సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో ఇప్పుడు రాబోతున్న రాబిన్ హుడ్ పై మంచి అంచనాలే ఉన్నాయి. అయితే రాబిన్ హుడ్ సినిమా పట్ల దర్శకుడు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అదే నమ్మకంతో రాబిన్ హుడ్ ఉత్తరాంధ్ర థియేట్రికల్ హక్కులు కొనుగోలు చేసారు. కొందరేమో వెంకీ కుడుముల ఓవర్ కాన్ఫిడెన్స్ గా ఉన్నాడు అని కామెంట్స్ లేకపోలేవు. ఒకానొక దశలో నైజాం రైట్స్ ను హీరో నితిన్ కొనుగోలు చేయాలనుకున్నారు. మరి ఈ ఇద్దరు నమ్మకం నిజమవుతుందో లేదో ఈ నెల 28న తెలుస్తుంది.నితిన్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది