నెక్స్ట్ మూవీకి రామ్ చరణ్ షాకింగ్ రెమ్యూనరేషన్ ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దర్శక దిగ్గజం రాజమౌళి మాగ్నమ్ ఓపస్ యాక్షన్ డ్రామా ‘ఆర్ఆర్ఆర్’తో రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ డమ్ ను సొంతం చేసుకోవాలని ఆశిస్తున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ తరువాత వరుసగా మరో రెండు భారీ ప్రాజెక్ట్‌లను లైన్లో పెట్టాశారు చరణ్. అందులో విజనరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆర్సీ 15’ చిత్రీకరణ దశలో ఉంది. త్వరలోనే ‘ఆర్సీ 16’కూడా పట్టాలెక్కనుంది. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్లు జోరుగా సాగిస్తున్నారు టీం. ఈ నేపథ్యంలో చెర్రీ రెమ్యూనరేషన్ గురించి నేషనల్ మీడియాలో ఓ ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం రామ్ చరణ్ తన సినిమాలకు దాదాపు 50 కోట్లు పారితోషికం పుచ్చుకుంటున్నాడని ప్రచారం జరుగుతుండగా, ఇప్పుడు దానిని డబుల్ చేశాడని తాజాగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ తన రెమ్యునరేషన్ ని భారీగా పెంచేశాడని తెలుస్తుంది. ఇప్పుడు ఒక్కో ప్రాజెక్ట్‌కి 100 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన ఇప్పుడు రెమ్యూనరేషన్ పెంచేశాడంటూ వస్తున్న షాకింగ్ వార్తల్లో ఎంత మేరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. ‘ఆర్ఆర్ఆర్’ విడుదల తర్వాత చరణ్ తన స్టార్ డమ్ లో పెద్ద మార్పును అంచనా వేస్తున్నాడు చరణ్. ఇక ‘ఆర్ఆర్ఆర్’ క్రేజ్ ను సైతం ఇలా రెమ్యూనరేషన్ పెంచేసి ఉపయోగించుకుంటున్నాడు అని అంటున్నారు. తన నెక్స్ట్ సినిమాల్లో ఒక్కో సినిమాకు చెర్రీ వంద కోట్లు వసూలు చేస్తున్నాడు అంటూ వస్తున్న వార్తలు చర్చనీయాంశంగా మారాయి. ‘ఆర్ఆర్ఆర్’ హిట్ అయితే గనుక చరణ్ తన రెమ్యూనరేషన్ ను మరింత పెంచే అవకాశం ఉంది.
Also Read
- Irumudi : అయ్యప్ప ‘బంగారు పల్లకి’ సాంగ్ రెడీ అవుతోంది..!
- Korean Kanakaraju First Review: ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ రివ్యూ.. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఇవే.. అసలు మేటర్ ఏంటంటే?
- RGV: ఆర్జీవీకి జేడీ షాకింగ్ ప్రశ్న.. “పిచ్చోళ్లందరినీ మీరు పెట్టుకుంటారా? లేక వాళ్లే వస్తారా?”
- JD Chakravarthy: ఆర్జీవీకి తెలియకుండా జేడీ చేసిన పని.. కోన వెంకట్‌కు అలా కలిసి వచ్చిందా?
ఈ మెగా హీరో ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ ను పూర్తి చేసిన తర్వాత ‘ఆర్సీ 15’ షూటింగ్‌ను తిరిగి ప్రారంభిస్తాడు. ఆ తరువాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘ఆర్సీ 16’ కోసం డేట్స్ ను కేటాయించనున్నాడు చరణ్.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ‘వాటర్ బాయ్’గానే.. మేనేజ్మెంట్ నిర్ణయాలపై తీవ్ర ఆగ్రహం..
-
2027 World Cup: స్టార్ ప్లేయర్లకు నో ఛాన్స్.. వరల్డ్ కప్ జట్టులో ఊహించని ట్విస్ట్..
-
Irumudi : అయ్యప్ప ‘బంగారు పల్లకి’ సాంగ్ రెడీ అవుతోంది..!
-
24 Carat Gold: బంగారం 24 క్యారెట్లే ఎందుకు? 50 లేదా 100 క్యారెట్లు ఎందుకు ఉండవు? 3,000 ఏళ్ల చరిత్ర.. మీకు తెలుసా?
-
Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!