చిత్ర పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో నేడు మృతిచెందారు. పునీత్ రాజ్‌కుమార్ అకాల మరణం సినీ పరిశ్రమను దిగ్బ్రాంతికి గురిచేస్తోంది. శుక్రవారం ఆదాయంలో జిమ్ లో హెవీ వర్క్ అవుట్స్ చేస్తున్న ఆయనకు సడెన్ గా గుండెపోటు రావడంతో బెంగళూరు విఠల్‌మాల్య ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగానే ఆయన మృతి చెందారు. పునీత్ మరణానికి ఆయన చేసిన హెవీ వర్క్ అవుట్స్ యే కారణమా..? అంటే నిజమే అన్న మాటలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు జిమ్ లో భారీ భారీ వర్క్ అవుట్స్ చేస్తూ, ఫిట్ గా ఉండే పునీత్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఇలా జిమ్ లో వర్క్ అవుట్స్ చేస్తూ గుండెపోటు తెచ్చుకోవడం రాజ్ కుమార్ ఫ్యామిలీకి కొత్తేమి కాదు.
గతంలో పునీత్ అన్న శివ రాజ్ కుమార్ సైతం జిమ్ లో హెవీ వర్క్ అవుట్స్ చేస్తూ గుండెపోటుకు గురయ్యారు. గండం గట్టెక్కినట్లు ఆయన మృత్యువు నుంచి బయటపడ్డారు. కానీ, పునీత్ మాత్రం మృత్యువు ఒడిలోకి జారుకున్నారు. అంత భారీ భారీ వ్యాయామాలు చేయడం వలనే హార్ట్ ఎటాక్ వచ్చిందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. పునీత్ ఒక సినిమా కోసం ఎంతగా ప్రాణం పెడతారో అందరికి తెలిసిందే. తన తదుపరి చిత్రంలో బాడీ బిల్డర్ పాత్ర కోసం ఆయన పడిన కష్టం.. ఆయన ప్రాణాల మీదకే తెచ్చింది. ఆయన మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటని అందరికి తెల్సిందే..
