Site icon NTV Telugu

Radhe Shyam: ప్రభాస్.. మహేష్ ని రంగంలోకి దించుతున్నాడట..?

mahesh babu

mahesh babu

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాధేశ్యామ్. యూవీ క్రియేషన్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ఎట్టకేలకు మార్చి 11 న విడుదల కానుంది. ఇక ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, పోస్టర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజగా అందుతున్న సమాచారం బట్టి ఈ సినిమా మరింత క్రేజ్ ని సంపాదించుకోనున్నదట. రాధేశ్యామ్ హిందీ వెర్షన్ కోసం అమితాబ్ ని రంగంలోకి దించిన మేకర్స్ తెలుగు కోసం మహేష్ బాబును సెట్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

అద్భుతమైన లవ్ స్టోరీకి హిందీలో అమితాబ్ వాయిస్ ఓవర్ ఇస్తుండగా .. తెలుగులో మహేష్ తన గాత్రాన్ని అందించనున్నారట. మహేష్ కి వాయిస్ ఓవర్ ఇవ్వడం కొత్త కాదు. జల్సా చిత్రంలో పవన్ క్యారెక్టర్ ని పరిచయం చేసింది మహేష్ బాబునే. అంతే కాకుండా తెలుగు మార్కెట్ లో ఈ సినిమా క్రేజ్ ఇంకా పెంచడానికి మేకర్స్ ఈ విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే మేకర్స్.. మహేష్ తో మాట్లాడడం.. డార్లింగ్ కోసం ఆయన చేస్తాను అని చెప్పడం కూడా జరిగిపోయాయంట.. ఇదే కనుక నిజమైతే డార్లింగ్ ఫ్యాన్స్, మహేష్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజాంనేత ఉందో తెలియాలంటే మేకర్స్ అధికారికంగా ప్రకటించేవరకు ఆగాల్సిందే..

https://www.youtube.com/watch?v=v97rAjyN_hQ
Exit mobile version