యంగ్ టైగర్ ఎన్టీఆర్ అనగానే ఎలాంటి క్యారెక్టర్ ని అయినా చాలా ఈజ్ తో ప్లే చేసి హీరో గుర్తొస్తాడు. స్టార్ హీరోలు ఉంటారు, యాక్టర్స్ ఉంటారు కానీ ఒక స్టార్-యాక్టర్ అవ్వడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఎన్టీఆర్ ఆ అరుదైన రకం. వెస్ట్రన్ ఆడియన్స్ ని కూడా మెప్పించగల నటన ఎన్టీఆర్ సొంతం. ఇలాంటి నటుడికి ఎదురుగా మరో మోస్ట్ వెర్సటైల్ యాక్టర్ ఉంటే ఎలా ఉంటుంది? ఈ ఇద్దరూ స్క్రీన్ పైన నువ్వా నేనా అన్నట్లు పెర్ఫార్మెన్స్ చేస్తే ఎలా ఉంటుంది? ఇలాంటి ఆలోచనే కొరటాల శివ చేసినట్లు ఉన్నాడు. అందుకే ఎన్టీఆర్ 30 కోసం చియాన్ విక్రమ్ ని రంగంలోకి దించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు అనే వార్త సోషల్ మీడియాలో వినిపిస్తోంది. విక్రమ్ నటన గురించి, అతని వెర్సటాలిటీ గురించి ప్రత్యేకించి ఈరోజు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి పాత్రని అయినా? ఎలాంటి సీన్ ని అయినా సింపుల్ గా ఈజ్ తో చెయ్యడం విక్రమ్ కి అలవాటైన పని. ఇలాంటి నటుడు ఎన్టీఆర్ సినిమాలో ఒక రోల్ చేస్తున్నాడు అంటే తెరపై రెండు మద గజాలు కొట్టుకున్నట్లు ఉంటుంది.
సినీ అభిమానులకి ఐ ఫీస్ట్ లాంటి ఈ కాంబినేషన్ జరగబోతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి కానీ ఇంకా అఫీషియల్ గా ఎలాంటి అనౌన్స్మెంట్ బయటకి రాలేదు. ఒకవేళ ఇప్పుడు వినిపిస్తున్న రూమర్స్ నిజమైతే ఎన్టీఆర్ సినిమాలో ఎన్టీఆర్ కి ఎదురుగా ఎన్టీఆర్ స్థాయి నటుడు తెరపై కనిపిస్తాడు. జనతా గ్యారేజ్ సినిమాలో ఎన్టీఆర్-మోహన్ లాల్ ని కలిపినా కొరటాల శివ… ఈసారి ఎన్టీఆర్ 30కి విక్రమ్-ఎన్టీఆర్ లని కలిపి పాన్ ఇండియా హిట్ ఇస్తాడేమో చూడాలి. మార్చ్ నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనున్న ఈ మూవీ 2024 ఏప్రిల్ లో రిలీజ్ కానుంది. ‘ఎన్టీఆర్ 30’ సినిమాకి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తుండడంతో ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగాయి.