Ira Bhaskar: ధురంధర్ ‘‘హిందుత్వ’’ సినిమా.. పాక్‌పై స్వర భాస్కర్ తల్లి ప్రేమ..
- ధురంధర్ సినిమాపై స్వర భాస్కర్ తల్లి విమర్శలు..
- హిందుత్వ సినిమా అంటూ ఇరా భాస్కర్ వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ira Bhaskar: ‘‘ధురంధర్: ది రివెంజ్’’ ఒక వారం కంటే తక్కువ సమయంలో విడుదలకు సిద్ధమవుతుండటంతో, గత సంవత్సరం డిసెంబర్‌లో థియేటర్లలోకి వచ్చిన ధురంధర్ బాక్సాఫీస్ వద్ద తుఫాను కలెక్షన్లు సాధించింది. ఇప్పుడు సీక్వెల్ వస్తుండటంతో అందరి దృష్టి ఈ సినిమాపై ఉంది. ఈ సినిమాపై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వస్తున్నాయి. కొందరు దేశభక్తి చిత్రమని కీర్తిస్తుంటే, మరికొందరు మాత్రం రాజకీయాలను ఆపాదిస్తున్నారు.
Also Read
- PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
- Money Heist: 'మనీ హెయిస్ట్' ఫ్యాన్స్‌కు నెట్‌ఫ్లిక్స్ సర్ప్రైజ్.. ప్రొఫెసర్ ప్రయాణం ఇంకా ముగియలేదు!
- CM Vijay: తమిళనాడు సీఎంగా దళపతి విజయ్ .. 'జన నాయగన్' సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
- Peddi : బుకింగ్స్ ఓపెన్ చేసిన గ్లోబల్ స్టార్..అమెరికాలో ‘పెద్ది’ సందడి.. టికెట్ రేట్లు ఇవే!
తాజాగా, విమర్శకురాలు స్వర భాస్కర్ తల్లి ఇరా భాస్కర్ ‘‘ధురంధర్’’ విమర్శకుల జాబితాలో చేరారు. ఈ సినిమాను ‘‘బాగా నిర్మించిన చిత్రం’’, దర్శకుడు ఆదిత్య ధర్‌ను ‘‘సమర్థవంతమైన నిర్మాత’’గా పిలిచారు. అయితే, ఈ సినిమా సైద్ధాంతిక సందేశాన్ని విస్మరించలేమని చెప్పారు. హిందుత్వ భావజాలం ఉన్న వ్యక్తి రూపొందించిన చిత్రంగా ఆమె అభివర్ణించారు. యూట్యూబ్ ఛానెల్ కార్వాన్ ఇ మొహబ్బత్‌లో ఇరా మాట్లాడుతూ.. “బాక్సాఫీస్ వద్ద కోట్లు సంపాదిస్తున్న ధురంధర్ ఉదాహరణను నేను ఇస్తాను. బాక్సాఫీస్ వద్ద కూడా చాలా బాగా రాణిస్తోంది. హిందూత్వం, హిందూత్వ భావజాలం పట్ల సైద్ధాంతికంగా నమ్మకం ఉన్న చిత్రనిర్మాత నిర్మించిన సినిమాకు ఇది ఒక ఉదాహరణ.” అని విమర్శించారు.
‘‘ఇందులో చాలా హింస ఉంది. ముస్లింలు హింసాత్మక ప్రజలు అనే భావజాలాన్ని నిర్మిస్తోంది. పాకిస్తాన్‌ను చాలా హింసాత్మక దేశంగా చూపించారు. అక్కడ మీరు ఏ సాధారణ ముస్లింను చూడలేరు. అందరూ ఉగ్రవాదులు, గ్యాంగ్ స్టర్లు’’ అనే దృక్ఫథాన్ని ఈ సినిమా బలోపేతం చేస్తుందని విమర్శించారు. ఇది నిజమైన సంఘటనల ఆధారంగా నిర్మించిన కల్పిత చిత్రమని ఆరోపించారు.
తాజావార్తలు
-
Ragi Samosa: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. హెల్తీ ‘రాగి సమోసా’ను ‘సింపుల్‌గా ఇలా ట్రై చేయండి!
-
Tamil Politics: విజయ్‌పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?
-
RCB vs MI : RCB బౌలర్ల ధాటికి ముంబై తడబాటు.. భువనేశ్వర్ కుమార్ ‘నాలుగు’ వికెట్ల పంజా.!
-
PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
-
PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?