NTV Telugu Site icon

Mega 157: మూడు లోకాల్లో జగదేక వీరుడు…

Mega 157

Mega 157

మెగాస్టార్ చిరంజీవికి అసలు సిసలైన సినిమా పడితే.. థియేటర్ల జరిగే మాస్ జాతరను ఏ హీరో కూడా తట్టుకోలేడు. కానీ రీ ఎంట్రీ తర్వాత రీమేక్ సినిమాలు చేసి.. కాస్త అప్సెట్ చేశారు చిరు. ఇటీవల వచ్చిన ‘భోళా శంకర్’ సినిమా అయితే చిరు కెరీర్లోనే దారుణమైన డిజాస్టర్‌గా నిలిచింది. అందుకే.. అప్ కమింగ్ సినిమాలతో దుమ్ములేపేందుకు వస్తున్నాడు మెగాస్టార్. ఇప్పటికే బింబిసార దర్శకుడు వశిష్టతో మెగా 157 ప్రాజెక్ట్ అనౌన్స్ చేసేశారు. వాస్తవానికి బింబిసార తర్వాత సీక్వెల్‌ చేయాల్సిన వశిష్ట.. మెగా ఆఫర్‌తో రూట్ మార్చేశాడు. మెగాస్టార్ కోసం అదిరిపోయే సోషియో ఫాంటసీ కథ రెడీ చేసుకున్నాడు. రీసెంట్‌గా రిలీజ్ చేసిన అనౌన్స్మెంట్ పోస్టర్‌తో.. ఈ సినిమా నెక్స్ట్ లెవల్ అనేలా ఉంటుందని చెప్పేశారు.

పంచభూతాలను ఏకం చేసేలా ఉన్న పోస్టర్‌.. జగదేక వీరుడు అతిలోక సుందరి, అంజి సినిమాల తర్వాత మెగాస్టార్ చేస్తున్న సోషియో ఫాంటసీ సినిమా కావడంతో.. ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఇప్పుడు అంతకుమించి అనేలా మెగా 157 అప్డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సినిమా కథ మూడు లోకాల చుట్టూ తిరుగుతుందట. అంతేకాదు.. దాదాపు నలుగురు హీరోయిన్లను ఈ సినిమాలో తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అనుష్క శెట్టి, మృనాళ్‌ ఠాకూర్‌ దాదాపుగా కన్ఫర్మ్‌ అయిపోయారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపుకంటున్న ఈ సినిమా.. ఇదే ఏడాది చివర్లో లేదంటే వచ్చే ఏడాది ఆరభంలో సెట్స్ పైకి వెళ్లనుంది. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ పాన్‌ ఇండియా సినిమాకు కీరవాణి సంగీతం అందించనున్నాడు. మరి మూడు లోకాల కథతో మెగా 157 ఎలా ఉంటుంటో చూడాలి.

Show comments