Sankrathi Movies: తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. కొత్త అల్లుళ్ళు, కోడిపందాలు, వంటలు, సినిమా ఇవేమి లేకుండా సంక్రాంతి నిండుగా ఉండదు వారికి.. అందుకే సినీ పరిశ్రమకు కూడా సంక్రాంతి అంటేనే అతి పెద్ద పండుగ. ఇక సీనియర్లు, జూనియర్లు సంక్రాంతి రేసులో ఉండాలని పోటీ పడుతూ ఉంటారు. ఇక ఈసారి పోటీలో చివరిగా నిలిచాయి నాలుగు సినిమాలు.. ఇద్దరు టాలీవుడ్ సీనియర్ హీరోలు అయితే.. మరో ఇద్దరు కోలీవుడ్ స్థార్ హీరోలు. చిరంజీవి వాల్తేరు వీరయ్య,.. బాలయ్య వీరసింహారెడ్డి, విజయ్ వారసుడు, అజిత్ తెగింపు.. పేర్లు బావున్నాయి కదా.. కథలు కూడా బావుంటాయని అంటున్నారు డైరెక్టర్లు. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో అభిమానులను మెప్పించడానికి ఎవరి ప్రమోషన్లు వారు చేస్తున్నారు. ఇక మరోపక్క సోషల్ మీడియాలో సాంగ్స్, పోస్టర్లతో అదరగొట్టేస్తున్నారు. నాలుగు సినిమాల మీద అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి.
ఇకపోతే తాజాగా ఈ సంక్రాంతి సినిమాల రన్ టైం ఎంత అనేది తెలిసిపోయింది. వాల్తేరు వీరయ్య తప్ప మిగతా మూడు సినిమాల రన్ టైమ్ ఒకటే కావడం విశేషం. ఈ మూడు సినిమాలు కూడా 2 గంటల 40 నిమిషాల నిడివి తోనే వస్తున్నట్టుగా కనిపిస్తుంది. అయితే ఇంకా వాల్తేరు వీరయ్య, వీరసింహ రెడ్డి షూటింగ్ ను జరుపుకుంటున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం 2 గంటల 40 నిమిషాల నిడివి వరకే ఉంచుతున్నట్లు మేకర్స్ ప్రామిస్ చేసినట్లు తెలుస్తోంది. ఇక వాల్తేరు వీరయ్య మాత్రం కొద్దిగా నిడివి ఎక్కువ ఉండనుందని టాక్.. సెకండాఫ్ లో రవితేజ సీన్స్ కొన్ని పెంచడంతో నిడివి పెరిగిందని చెప్పుకొస్తున్నారు. మరి ఫైనల్ గా సెన్సార్ టాక్ వస్తే కానీ ఏ సినిమా ఎంత నిడివితో వస్తుందో చెప్పలేం. జనవరి మొదటి వారం చివర్లో ఈ సెన్సార్ టాక్ రానున్నట్లు తెలుస్తోంది.
