Indraja Shankar:కోలీవుడ్ స్టార్ కమెడియన్ రోబో శంకర్ ఇంట పెళ్లి భాజాలు మోగాయి. ఆయన కుమార్తె ఇంద్రజ శంకర్ వివాహం నేడు ఘనంగా జరిగింది. 20 ఏళ్ల వయసులో తన క్లోజ్‌ఫ్రెండ్, డైరెక్టర్ కార్తీక్‌తో ఏడడుగులు వేసింది. వీరి నిశ్చితార్థం ఫిబ్రవరి 2న గ్రాండ్ గా జరిగింది. ఇంద్రజ కూడా నటినే. తండ్రిలానే ఆమె కుండా లేడీ కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా తమిళ్ మూవీ బిగిల్ లో గుండమ్మగా ఆమె ఎంతో ఫేమస్ అయ్యింది. ఇక పాగల్ సినిమాలో విశ్వక్ ప్రేమలో పడే అమ్మాయిగా కూడా ఇంద్రజ కనిపించి మెప్పించింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఇంద్రజ, డైరెక్టర్ కార్తీక్ తో ప్రేమలో పడింది. వీరి ప్రేమ నేది పెళ్లిగా మారింది. చెన్నైలో జరిగిన ఈ పెళ్లి వేడుకకు కోలీవుడ్ స్టార్స్ అందరూ హాజరయ్యారు.
ఇక తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఇంద్రజ.. దేవుడు ఆశీస్సులతో ఇద్దరం ఒక్కటయ్యాం అని రాసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక పెళ్లి తరువాత కూడా ఆమె సినిమాలు కంటిన్యూ చేస్తుందని సమాచారం. ఇంద్రజ తండ్రి శంకర్ తెలుగులో కూడా సుపరిచితుడే. ముఖ్యంగా ధనుష్ సినిమా అయినా మారి లో అతడి కామెడీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మిమిక్రీ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన శంకర్ రోబో డ్యాన్స్ ద్వారా రోబో శంకర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇక ఇదర్కుతనే ఆశైపట్టై బాలకుమార అనే సినిమాలో రోబో శంకర్ కు గుర్తింపు వచ్చింది.