Indiana Jones: లెజెండ్ ఆఫ్ వరల్డ్ సినిమా రిటర్న్ అవుతున్నాడు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరల్డ్ సినిమాలో ఎన్నో ఐకానిక్ క్యారెక్టర్స్ ఉంటాయి కానీ ప్రతి సినీ అభిమాని నుంచి వచ్చే ఒకేఒక్క ఐకానిక్ క్యారెక్టర్ పేరు ‘హెన్రీ వాల్టన్’. ఈ ఫిక్షనల్ క్యారెక్టర్ 80’ల నుంచి ఇప్పటివరకూ సినీ అభిమానులని ‘ఇండియానా జోన్స్’ సినిమాతో అలరిస్తూనే ఉన్న ఉంది. ‘ఇండియానా జోన్స్’ ది బెస్ట్ అడ్వెంచర్ సినిమా ఎవర్ మెడ్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ సినిమా అనే చెప్పాలి. దర్శక ధీరుడు రాజమౌళి మాటల్లో ‘ఇండియానా జోన్స్’ వినిపించే అంతగా ఇంకో సినిమా పేరు వినిపించదు. అంతలా జక్కన్నని మెప్పించిన ‘ఇండియానా జోన్స్’ సినిమాల్లో అసలు ఏముంటుంది అనేది తెలియాలి అంటే 2023 జూన్ 30న థియేటర్స్ కి వెళ్లాల్సిందే.
డాక్టర్ ‘హెన్రీ వాల్టన్’ అనే ఫిక్షనల్ ఆర్కియాలజీ ప్రొఫెసర్ చేసే అడ్వెంచర్స్ ని చూపించే సినిమా ‘ఇండియానా జోన్స్’. ఈ అడ్వెంచర్ డ్రామాలో టైటిల్ రోల్ ని ‘హర్రిసన్ ఫోర్డ్’ ప్లే చేస్తున్నాడు. వరల్డ్స్ గ్రేటెస్ట్ డైరెక్టర్స్ లో ఒకరైన ‘స్టీఫెన్ స్పీల్ బర్గ్’ రూపొందించిన ఈ అమెరికన్ ఫ్రాంచైజ్ లో ఇప్పటివరకూ నాలుగు సినిమా వచ్చాయి. మొదటిది ‘రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్’ అనే పేరుతో 1981 జూన్ 12న రిలీజ్ అయ్యింది. సెకండ్ సినిమా ‘ఇండియానా జోన్స్ అండ్ ది టెంపుల్ ఆఫ్ డూమ్’ 1984 మే 23న ప్రేక్షకుల ముందుకి వచ్చింది. రెండో సినిమా వచ్చిన అయిదేళ్లకి మూడో సినిమా ‘ఇండియానా జోన్స్ అండ్ ది లాస్ట్ క్రూసేడ్’ 1989 మే 24న విడుదలయ్యింది. అప్పట్లో మూడో సినిమాతోనే ‘ఇండియానా జోన్స్’ ఎండ్ అయిపోయిందని అంతా అనుకున్నారు. మళ్లీ 19 ఏళ్ల తర్వాత 2008 మే 22న ‘ఇండియానా జోన్స్ అండ్ ది కింగ్‌డమ్ అఫ్ ది క్రిస్టల్ స్కల్’ పేరుతో నాలుగో సినిమా బయటకి వచ్చింది.
Also Read
- Ashok Kumar : ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల్లో ట్విస్ట్.. అశోక్ కుమార్ సంచలన ఆరోపణలు
- Dear You: రూ.132 కోట్ల బడ్జెట్.. రూ.2,849 కోట్ల వసూళ్లు.. ఈ చైనీస్ సినిమా వెనుక అసలు కథ ఇదే!
- Vedika Pinto: లక్ష్య సరసన ‘ముసాఫిర్ కేఫ్’ బ్యూటీ.. ‘రాఖ్’ డైరెక్టర్‌తో సైకలాజికల్ లవ్ స్టోరీ!
- Toxic: సొంత గడ్డపైనే యశ్‌కు షాక్.. ‘టాక్సిక్’ వసూళ్లు చూసి ట్రేడ్ వర్గాలు అవాక్కు!
‘ఇండియానా జోన్స్’ ఫ్రాంచైజ్ నుంచి వచ్చిన ఈ నాలుగు సినిమాలు కొన్ని దశాబ్దాలుగా సినీ అభిమానులని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు ఈ ఫ్రాంచైజ్ నుంచి ఐదో సినిమా ‘ఇండియానా జోన్స్ అండ్ ది డయిల్ ఆఫ్ డెస్టినీ’ పేరుతో జూన్ 30న విడుదల కానుంది. ప్రపంచవ్యాప్తంగా భారి స్థాయిలో రిలీజ్ కానున్న ఈ మూవీ ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. గ్రాండ్ విజువల్స్, స్టన్నింగ్ యాక్షన్స్ ఎపిసోడ్స్ తో ట్రైలర్ అదిరిపోయింది. హర్రిసన్ ఫోర్డ్ ని ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఇండియానా జోన్స్ సినిమాలో హెన్రి వాల్టన్ పాత్రలో చూడడం నాస్టాల్జిక్ ఫీలింగ్ కలిగించింది. ఎన్నేళ్ళు అయినా ఈ ఫ్రాంచైజ్ లో ఉండే మ్యాజిక్ పోదు అనే నమ్మకాన్ని ట్రైలర్ తోనే కలిగించడంలో మేకర్స్ సక్సస్ అయ్యారు. అయితే మొదటి నాలుగు సినిమాలని తెరకెక్కించిన ‘స్టీఫెన్ స్పీల్బర్గ్’ ఈ 5వ సినిమాని రూపొందించలేదు. ‘ది వోల్వరేన్’, ‘లోగన్’, ‘ఫోర్డ్ vs ఫెరారీ’ సినిమాలని డైరెక్ట్ చేసిన ‘జేమ్స్ మాన్గోల్డ్’ ఇండియానా జోన్స్ 5వ సినిమాని డైరెక్ట్ చేశాడు. ‘స్పీల్ బర్గ్’ లేకుండా ‘ఇండియానా జోన్స్’ లో ఆ రేంజ్ మ్యాజిక్ ని ఉంటుందా అనే అనుమానం ప్రతి ఫ్రాంచైజ్ లవర్ లోనూ ఉంటుంది కానీ ఆ డౌట్స్ ని వదిలేసి థియేటర్ కి వచ్చి ఎంజాయ్ చెయ్యండి అని చెప్పే రేంజులో ట్రైలర్ ని కట్ చేసారు. మరి జూన్ 30న ఈ ఎపిక్ అడ్వెంచర్ డ్రామా ఎలాంటి సెన్సేషన్ ని క్రియేట్ చేస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
CM Vijay: సీఎం విజయ్ను కలిసిన టీఎంసీ రెబెల్ ఎంపీ సయానీ ఘోష్
-
YS Jagan: నీటి విడుదలపై పొలిటికల్ వార్.. క్రెడిట్ కోసం చంద్రబాబు ఆరాటం.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
-
CM Revanth Reddy : రాహుల్‌నే ప్రధాని చేయాలి.. వైఎస్సార్‌కు అదే నివాళి
-
Yasin Malik: ‘‘నన్ను ఉరితీయక ముందే నిన్ను విముక్తి చేస్తా’’.. భార్యకు యాసిన్ మాలిక్ విడాకులు
-
Jeetendra Mishra: ‘రామ మందిర నిర్వహణ అద్భుతం.. జితేంద్ర మిశ్రా కితాబు
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!