Indian Cinema: పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్న ఇండియన్ సినిమాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Cinema: ఇండియన్ సినిమా ఇప్పుడు మన దేశ సరిహద్దులు దాటి పాన్ ఇండియా నుంచి పాన్-వరల్డ్ రేంజ్‌కు దూసుకుపోతోంది. ఒకప్పుడు మన సినిమాలను కేవలం ఇండియన్స్ మాత్రమే చూసేవారు. అయితే ఇప్పుడు హాలీవుడ్ సినిమాల తరహాలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న విదేశీ ఆడియన్స్ కూడా మన కంటెంట్‌కు ఫిదా అవుతున్నారు. గతంలో కేవలం అమెరికా, లండన్ లాంటి ప్రాంతాలకే పరిమితమైన మన మార్కెట్, ఇప్పుడు జపాన్, చైనా, రష్యా, సౌత్ కొరియా లాంటి దేశాలకు కూడా విస్తరించింది. మన సినిమాలను అక్కడి లోకల్ లాంగ్వేజెస్‌లోకి డబ్ చేసి రిలీజ్ చేస్తుండటంతో గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర వందల కోట్లు వసూలవుతున్నాయి. ఈ గ్లోబల్ సక్సెస్‌కు మన పురాణాలు, జానపద కథలు, హాలీవుడ్ లెవెల్ విజువల్ ఎఫెక్ట్స్ కూడా కీలకంగా మారాయి. ఇటీవలే మరాఠీ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా ‘గోంధళ్’ 2027 ఆస్కార్ అవార్డుల రేసులో భారత్ తరఫున అఫీషియల్ ఎంట్రీగా ఎంపికవ్వడం, కేవలం ₹2 కోట్ల చిన్న బడ్జెట్‌తో వచ్చి వరల్డ్‌వైడ్‌గా ₹300 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన ‘హనుమాన్ అంశ్’ లాంటి సినిమాలు అంతర్జాతీయ వేదికలపై మన కంటెంట్ పవర్ ఏంటో నిరూపించాయి.
ఈ క్రేజ్ వల్ల విదేశీ డిస్ట్రిబ్యూటర్లు కూడా ఇండియన్ సినిమాలను కొనుగోలు చేయడానికి లైన్ కడుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ అంతర్జాతీయ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ మైండ్ బ్లోయింగ్ భారీ ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న గ్లోబల్ అడ్వెంచర్ ‘వారణాసి’, ప్రభాస్ నటిస్తున్న ఇంటర్నేషనల్ కాప్ థ్రిల్లర్ ‘స్పిరిట్’, అల్లు అర్జున్ – అట్లీల ₹1,000 కోట్ల సోషియో-ఫాంటసీ సైన్స్-ఫిక్షన్ ‘రాకా’, సల్మాన్ ఖాన్ టైటిల్ రోల్ పోషిస్తున్న మైథలాజికల్ వార్ సాగా ‘కర్ణ’, దీపావళికి రిలీజ్ కాబోతున్న ‘రామాయణ’ లాంటి సినిమాలు ఇండియన్ సినిమాను వరల్డ్ లెవెల్లో నెక్స్ట్ స్టేజ్‌కు తీసుకెళ్లడానికి పక్కా ప్లాన్‌తో రెడీ అవుతున్నాయి. ఇప్పటికే యష్ ప్రొడ్యూసర్ గా ఉన్న ‘రామాయణ’ ప్రాజెక్ట్ కోసం సోనీ ఇంటర్నేషనల్ పిక్చర్స్‌తో మేకర్స్ భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ రాకా కూడా ఓ ప్రముఖ అంతర్జాతీయ సంస్థతో కలిసి పనిచేయబోతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ప్రాంతీయ సినిమాలు పాన్ ఇండియా రేంజ్ దాటి, పాన్ వరల్డ్ స్థాయికి వెళ్ళడం సినీ ఇండస్ట్రీకి ఒక శుభ పరిణామంగా భావిస్తున్నారు భారతీయ సినీ అభిమానులు.
Also Read
- Sonu Sood: కొత్త ఐఫోన్ కోసం క్యూలో జనం.. యూజర్స్ కి సోనూ సూద్ చురకలు
- Peddi - Irumudi: 'పెద్ది' ఓడిపోయింది.. 'ఇరుముడి' గెలవలేకపోయింది!
- Jailer 2: ‘జైలర్ 2’ నుంచి ఫస్ట్ ప్రోమో రిలీజ్.. సూరజ్ వెంజరమూడుకు అదిరిపోయే క్యారెక్టర్!
- Sigma Trailer: సందీప్ కిషన్ ‘సిగ్మా’ ట్రైలర్ వచ్చేసింది.. రూ.500 కోట్ల రాకెట్‌తో హీరో ఫైట్!
తాజావార్తలు
-
Indian Cinema: పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్న ఇండియన్ సినిమాలు
-
Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
Shivam Dube: ధోనీ vs రోహిత్.. ఇద్దరిలో ఎవరు బెస్ట్ టీ20 కెప్టెన్.. దూబేకు పెద్ద సమస్యే వచ్చిందే!
-
Wine: చిన్న పెగ్ తాగినా రిస్కేనా? అమ్మాయిలు తప్పకుండా తెలుసుకోవాల్సిన మ్యాటర్ ఇది!
-
Rajesh Rawani Success Story: డ్రైవర్ తండ్రిని కోటీశ్వరుడిని చేసిన కొడుకు ఐడియా.. రాజేష్ రావణి సక్సెస్ స్టోరీ
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!