Virat Kohli : పాకిస్థాన్-భారత్ సాగిస్తున్న యుద్ధ వాతావరణ సమయంలో ప్రతి ఒక్కరూ ఇండియన్ ఆర్మీకి మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సోషల్ మీడియా వేదికగా ఇండియన్ ఆర్మీకి మద్దతు ప్రకటించారు. ‘ఈ క్లిష్ట సమయంలో దేశాన్ని కాపాడుతున్న ఆర్మీకి బిగ్ సెల్యూట్. వారు, వారి కుటుంబ త్యాగాలను వెలకట్టలేం. వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం’ అంటూ ఎక్స్ వేదికగా రాసుకొచ్చాడు విరాట్ కోహ్లీ. విరాట్ తో పాటు ఇతర క్రీడాకారులు కూడా మద్దతు తెలిపారు.
Read Also : Gill-Rohit: ప్రతి ఒక్కరికీ నువ్వు స్ఫూర్తి.. ఆ విషయాలను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా!
బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు మద్దతు తెలిపింది. ‘మీ నిస్వార్థ సేవలు, ధైర్య సాహసాలే మన జాతికి బలం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్ల మీ సేవలను మరువలేం. మీరు ఎప్పటికీ రుణపడి ఉంటాం’ అంటూ తెలిపింది.
‘పాకిస్థాన్ చేస్తున్న దాడిని అడ్డుకుంటూ మనల్ని కాపాడుతున్న ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ చేద్దాం’ అంటూ శిఖర్ ధావన్ తెలిపాడు. వీరే కాకుండా ఇతర క్రీడాకారులు కూడా ఇండియన్ ఆర్మీకి మద్దతు తెలుపుతున్నారు.
Read Also : Rashmika : ఉగ్రవాదాన్ని నిర్మూలించాల్సిందే.. ఆర్మీకి రష్మిక మద్దతు
