SLV Cinemas: ‘దసరా’ రిలీజ్ అయ్యే వరకూ ఆపుకోవచ్చు కదయ్యా…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా స్థాయిలో సినిమా చేసినప్పుడు ప్రమోషన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమోషన్స్ కూడా పాన్ ఇండియా స్థాయిలో చెయ్యాలి. భారి బడ్జట్ తో సినిమా చేసి హ్యుజ్ ప్రమోషన్స్ చేస్తున్న సమయంలో ఆ చిత్ర యూనిట్ దృష్టి అంతా ఆ సినిమాపైనే ఉండాలి. కొంచెం అటు ఇటు డీవియేట్ అయినా ఆడియన్స్ కాన్సెన్ట్రేషన్ లో డిస్ట్రాక్షన్ వచ్చే ప్రమాదం. ఈ విషయం తెలియక SLV సినిమాస్ రిస్క్ చేస్తోంది. నానితో ‘దసరా’ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో చేస్తున్న ప్రొడక్షన్ హౌజ్ ‘SLV సినిమాస్’. గతంలో పడి పడి లేచే మనసు, విరాటపర్వం లాంటి సినిమాలు చేసిన SLV సినిమాస్ నుంచి వస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా దసరానే. మార్చ్ 30న ప్రేక్షకుల ముందుకి రానున్న దసరా ప్రమోషన్స్ ని మంచి స్వింగ్ లో చేస్తున్న సమయంలో SLV సినిమాస్ నుంచి ఎలాంటి అప్డేట్ బయటకి వచ్చినా అది దసరా సినిమా గురించే అనుకుంటారు ఆడియన్స్. అలాంటిది దసరా సినిమా గురించి ఇంకో సినిమా గురించి అప్డేట్ బయటకి వచ్చింది అంటే ఫాన్స్ అప్సెట్ అవ్వడంతో పాటు డిస్ట్రాక్ట్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. ఇప్పుడు SLV సినిమాస్ ఇలాంటి తప్పునే చేస్తుంది.
దసరా రిలీజ్ కి రెడీ అవుతున్న సమయంలో మార్చ్ 30 వరకూ వెయిట్ చెయ్యకుండా SLV సినిమాస్ తమ కొత్త సినిమా అప్డేట్ ని అనౌన్స్ చేస్తోంది. SLV సినిమాస్ గతేడాది ఏప్రిల్ లో యంగ్ హీరో నాగ శౌర్యతో కలిసి ఒక సినిమా అనౌన్స్ చేసింది. పవన్ బాసంశెట్టి అనే కొత్త దర్శకుడితో SLV సినిమాస్ నిర్మిస్తున్న ఈ మూవీ టైటిల్ ని మార్చ్ 22న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. గత ఉగాదికి అనౌన్స్ అయిన మూవీ టైటిల్ ఈ ఉగాదికి అనౌన్స్ చేస్తున్నారు. పవన్ సీహెచ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీ టైటిల్ ని ఉగాది రోజున అనౌన్స్ చేస్తున్నాం అంటూ SLV సినిమాస్ నుంచి బయటకి రాగానే కొన్ని రోజులు ఆగలేవా? దసరా రిలీజ్ అయ్యే వరకూ వేరే సినిమాల అప్డేట్ ఇవ్వకు, దసరా సినిమాని బయటకి రానివ్వండి అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మరి అభిమానుల కోరికని మన్నించి నాగ శౌర్య సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ ని SLV సినిమాస్ కాస్త వాయిదా వేస్తారేమో చూడాలి.
Also Read
- Chennai Love Story: 'బేబీ'ని మించిన హిట్.. 'చెన్నై లవ్ స్టోరీ'పై కిరణ్ అబ్బవరం, సాయి రాజేష్ ఎమోషనల్ కామెంట్స్
- Chennai Love Story: 'చెన్నై లవ్ స్టోరీ' సక్సెస్ మీట్లో ఎమోషన్స్.. రూ.12 కోట్ల ఓపెనింగ్ నుంచి గౌరీ ప్రియపై ప్రశంసల వరద
- Kajal Aggarwal: కారవాన్లోకి దూసుకొచ్చి షర్ట్ విప్పేశాడు.. కాజల్ చెప్పిన షాకింగ్ ఘటన!
- Jyothika: ఇక చాలు.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.. జ్యోతిక సంచలన పోస్ట్!
New beginnings this New Year ❤️
Happy to announce our next with the young and talented @IamNagashaurya to be directed by the debutant @PawanBasamsetti.#ProductionNo6 Shoot Begins Soon 🎬Happy Ugadi ❤️ pic.twitter.com/BhHwPcsP9D
— SLV Cinemas (@SLVCinemasOffl) April 2, 2022
ఈ ఉగాదికి ఊరంతా హోరెత్తిపోద్ది 💥@IamNagashaurya's next – #NS23 Title Reveal on March 22nd marking the auspicious occasion of Ugadi 🔥@PawanBasamsetti @pawanch19 pic.twitter.com/jT4IdNvbzr
— SLV Cinemas (@SLVCinemasOffl) March 20, 2023
తాజావార్తలు
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Dharmendra Pradhan: సోషల్ మీడియా ఖాతాల్లో మార్పు.. కేంద్రమంత్రి హోదా తొలగింపు
-
Abhijeet Dipke: నా కొడుకు కష్టానికి ఫలితం దక్కింది.. అభిజిత్ దీప్కే తల్లి ఆనందం
-
CJP: “ఇది ఫస్ట్ వికెట్ మాత్రమే”.. సీజేపీ సంచలనం.. ప్రధాన్ రాజీనామాతో ఆగదా..?
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
ట్రెండింగ్
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, ఐఫోన్-స్టైల్ బార్ తో రాబోతున్న OPPO Find X10..!
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!