NTV Telugu Site icon

Imran Hashmi: ఇమ్రాన్ హష్మీ మెడకు గాయం.. ఏమైందంటే?

Imran Hashmi

Imran Hashmi

Imran Hashmi: బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీకి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్‌లో ఓ సినిమా యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్న సమయంలో ఇమ్రాన్‌కు ఈ గాయాలయ్యాయి అని తెలుస్తోంది. అడవి శేష్ హీరోగా నటిస్తున్న గూఢచారి 2 సినిమాలో ఇమ్రాన్ హష్మీ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా సెట్స్‌లో ఇమ్రాన్ తనదైన స్టంట్స్ చేస్తున్నాడని సమాచారం. ఈ సమయంలో అతనికి గాయాలయ్యాయి అని ప్రాథమిక సమాచారం. ఇమ్రాన్ హష్మీ ఒక యాక్షన్ సీన్ చేస్తున్నప్పుడు ఈ గాయమైంది. స్వయంగా డిజైన్ చేసుకున్న ఓ యాక్షన్ సీక్వెన్స్ పెర్ఫాం చేస్తున్న సమయంలో ఒక చోట నుంచి మరో చోటకు దూకుతున్న సమయంలో మెడకు గాయమైంది అని తెలుస్తోంది.

Also Read: Karan Johar: ఇక రిలీజ్ కు ముందు సినిమాలు చూపించం.. కరణ్ జోహార్ సంచలనం

ఇక ఇమ్రాన్ హష్మీ పిక్స్ కూడా బయటకు వచ్చాయి. అందులో ఇమ్రాన్ మెడకు గాయం స్పష్టంగా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా తర్వాత ఇమ్రాన్ నటుడిగా నటిస్తున్న రెండో తెలుగు సినిమా ఇది. ఇమ్రాన్ హష్మీ 2002లో ‘ఫుట్‌పాత్’ మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. కానీ ‘మర్డర్’ (2004) సినిమాతో ప్రజాదరణ పొందాడు. ఆ తర్వాత ఇమ్రాన్ హష్మిన్ ‘మర్డర్ 2’, ‘జన్నత్’, ‘ఆషిక్ బనాయా ఆప్నే’, ‘రాజ్ 3’, ‘అవారపాన్’, ‘హమారీ అధురీ కహానీ’, ‘జెహెర్’, ‘జన్నత్ 2’, ‘వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్. ముంబై ‘టైగర్ 3’ తదితర సినిమాలు చేశారు

Show comments