పాట ఎలా ఉండాలో చెప్పిన ఇళయరాజా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోట్లాదిమంది పెదాలపై మాస్ట్రో ఇళయరాజా స్వరపరిచిన పాటలు ఇప్పటికీ నాట్యం చేస్తూనే ఉంటాయి. వేయికి పైగా చిత్రాలకు స్వరాలు సమకూర్చిన ఇళయరాజా నేటికీ అలుపుసొలుపు లేకుండా అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. సినిమా పాట ఎలా ఉండాలో అలతి పదాలతో వివరించారు ఇళయరాజా. అప్పుడే వికసించిన కుసుమంలా పాట ఉండాలంటారు ఇళయరాజా. అంతేకాదు… ఆ పాటను ఎప్పుడు విన్నా… అదే అనుభూతి శ్రోతలకు కలగాలంటారు. ఆయన పాటలలో అలాంటి తాజాదనం ఉంది కాబట్టే దశాబ్దాలు గడిచిన ఆ పాటలను జనం ఆస్వాదిస్తున్నారనిపిస్తుంది. ఇంతకూ ఈ విషయాలను తెలియచేసింది మరెవరో కాదు ఇళయరాజా శిష్యుడు ఎ. ఆర్. రెహమాన్.
ఇటీవల ఓ తమిళ దిన పత్రికలో ఇళయరాజా పాట గురించి చెప్పిన వ్యాసం ఒకటి ప్రచురితమైంది. దానిని ఎ. ఆర్. రెహమాన్ తన సోషల్ మీడియా అక్కౌంట్ లో ట్యాగ్ చేశారు. ఆస్కార్ విజేత ఎ. ఆర్. రెహమాన్ కెరీర్ ప్రారంభంలో ఎమ్మెస్ విశ్వనాథన్, కె. వి. మహదేవన్, ఇళయరాజా, రాజ్ కోటి తదితరుల దగ్గర వాద్యకారునిగా పనిచేశారు. ఆ సమయంలో సీనియర్ సంగీత దర్శకుల దగ్గర నేర్చుకున్న గొప్ప విషయాలను రెహమాన్ ఆచరణలో పెట్టారు. విశేషం ఏమంటే ఇప్పుడు ప్రపంచం గర్వించే సంగీత దర్శకునిగా రెహమాన్ గుర్తింపు తెచ్చుకున్నా, తన గురువుల గొప్పతనాన్ని మాత్రం విస్మరించలేదనడానికి ఇదే తాజా ఉదాహరణ. రెహమాన్ స్వరాలు సమకూర్చిన ‘మిమి’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉండగా, ‘హిందుస్తానీ వే’ పేరుతో చేసిన టోక్యో ఒలింపిక్స్ చీర్ అప్ సాంగ్ సైతం శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోంది.
Also Read
- Mega Box Office Clash: 'కాకా' కర్చీఫ్ వేసిన చోటే 'విశ్వంభర' కన్ను.. సంక్రాంతి బరిలో మెగా క్లాష్?
- Poojitha Ponnada: AK47లో ఫుల్ లెంగ్త్ రోల్ అని పిలిచి.. సైలెంట్‌గా వేరే హీరోయిన్ను పెట్టేశారు!
- Ramayana Record: రామాయణ వరల్డ్ రికార్డు.. బాహుబలి 2 రికార్డు బ్రేక్.. నెక్స్ట్ టార్గెట్..?
- Chiranjeevi: 'కాకా' కూడా హిట్ పడితే ఇక చిరునే టాప్?
తాజావార్తలు
-
Flipkart CEO: 11 ఏళ్ల ప్రస్థానానికి తెర.. ఫ్లిప్‌కార్ట్ సీఈఓ రాజీనామా..
-
Mega Box Office Clash: ‘కాకా’ కర్చీఫ్ వేసిన చోటే ‘విశ్వంభర’ కన్ను.. సంక్రాంతి బరిలో మెగా క్లాష్?
-
Sreejith Ravi : బాలికలతో అసభ్య ప్రవర్తన.. పోక్సో కేసులో ప్రముఖ విలన్‌కు షాక్
-
David Warner: సన్‌రైజర్స్ హైదరాబాద్‌లోకి వార్నర్ మళ్లీ వస్తాడా?.. ఆరెంజ్ ఆర్మీ ప్లాన్ ఏంటి..?
-
Vaibhav Sooryvanshi: నేను ముందే చెప్పా.. 200 కాదు 300 నా టార్గెట్..
ట్రెండింగ్
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్‌ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!
-
Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి
-
Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్‌లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
-
Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!