Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Icon Star Allu Arjun Creates History With National Award

Icon Star Allu Arjun: 20 సినిమాలకే… 69 ఏళ్ల చరిత్ర తిరగరాశాడు!

Published Date :August 25, 2023 , 12:43 pm
By Shiva Kranthi
Icon Star Allu Arjun: 20 సినిమాలకే… 69 ఏళ్ల చరిత్ర తిరగరాశాడు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

అల్లు అర్జున్ ఫస్ట్ సినిమా ‘గంగోత్రి’ 2003లో రిలీజ్ అయింది. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు.. అసలు బన్నీది హీరో కటౌటేనా? అని పెదవి విరిచారు చాలామంది. ఇక్కడే బన్నీని తక్కువ అంచనా వేశారు. ఎందుకంటే.. ఇప్పటి వరకు ఎందరో స్టార్ కిడ్స్ హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అందులో కొందరు మాత్రమే సక్సెస్ అయ్యారు. మిగతా వాళ్లు ఫేడవుట్ అయిపోయారు. బన్నీని కూడా ఈ లిస్ట్‌లోనే పడేశారు. తండ్రి అల్లు అరవింద్ స్టార్ ప్రొడ్యూసర్… పైగా మెగా బ్రాండ్‌ కదా… అతనికేం కష్టం? ఎందుకు హార్డ్ వర్క్ చేస్తాడులే అని అనుకున్నారు కానీ అక్కడుంది గాండీవధారి ధరించిన అల్లు అర్జున్. కామెంట్సే కాదు ఫెయిల్యూర్‌ను కూడా అంత ఈజీగా వదిలిపెట్టలేదు. అందుకే సెకండ్ సినిమా ‘ఆర్య’తో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఈ సినిమాతోనే సుకుమార్ డైరెక్టర్‌గా పరిచయమయ్యాడు.

అసలు గంగోత్రిలో చూసిన బన్నీ… ఆర్యలో చూసిన బన్నీ ఒక్కడేనా అనేలా అందరి నోర్లు మూయించాడు. అక్కడి నుంచి స్టైలిష్ స్టార్‌గా 2021 వరకు 20 సినిమాలు చేశాడు బన్నీ. తనకంటూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. ప్రతి సినిమాను ఫస్ట్ సినిమాలా భావిస్తూ… 20 ఏళ్లలో 20 సినిమాలు చేసిన బన్నీ.. ఒక తెలుగు నటుడిగా 69 ఏళ్ల కలను సాకారం చేశాడు. ఇప్పటి వరకు ఒక్క తెలుగు హీరో కూడా ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్ అందుకోలేదు, ఇప్పుడు పుష్ప సినిమాతో అల్లు అర్జున్ చరిత్ర తిరగరాశాడు. తాజాగా ప్రకటించిన 69వ నేషనల్ అవార్డ్స్‌లో పుష్ప సినిమాకు గాను బెస్ట్ యాక్టర్‌ అవార్డ్ సొంతం చేసుకున్నాడు. ఎవ్వరైతే గంగోత్రి సమయంలో బన్నీని హీరో కాదని అన్నారో… వాళ్లే ఇప్పుడు బన్నీని ఆకాశానికెత్తుస్తున్నారు. కథ ఇక్కడితో అయిపోలేదు, ఆగిపోలేదు… అసలు కథ ఇప్పుడే స్టార్ట్ అయింది.

అల్లు అర్జున్ చేయాల్సింది ఇంకా చాలా ఉందని… పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ రేంజ్‌లో సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నాడని సన్నిహిత అంటున్నారు. ఇక సుకుమార్, బన్నీది డెడ్లీ కాంబినేషన్. సుకుమార్ లేకుంటే తాను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదని చెబుతునే ఉంటాడు బన్నీ. ఈ ఇద్దరు కలిసి ఆర్య, ఆర్య2, పుష్ప సినిమాలు చేశారు. బన్నీని స్టైలిష్ స్టార్‌ చేసిన సుకుమార్.. పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్‌ బిరుదు ఇచ్చాడు. అంతేకాదు.. పాన్ ఇండియా హీరోగా బన్నీని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లేందుకు ట్రై చేస్తున్నాడు. పుష్ప2 సినిమాతో బన్నీ క్రేజ్ మామూలుగా ఉండదని.. నేషనల్ అవార్డ్‌తో చెప్పేశాడు. పుష్ప2 తర్వాత త్రివిక్రమ్‌తో భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. ఆ తర్వాత సాలిడ్ లైనప్ సెట్ చేసే పనిలో ఉన్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Allu Arju Journey
  • Allu Arjun
  • Allu Arjun National Award
  • Allu Arjun Pushpa 2
  • Pushpa 2 Latest Updates

తాజావార్తలు

  • YS Jagan: అమరావతి అవినీతి గని.. MAVIGUN ప్రణాళికే బెస్ట్‌..!

  • Shouryuv: ఆ ఒక్క కారణంతోనే మృణాల్‌ని ఫిక్స్ చేశా.. డైరెక్టర్ శౌర్యువ్ మాటలకు నాని షాక్!

  • Lenin vs Peddi : ‘లెనిన్’ దిగుతున్నాడు.. ‘పెద్ది’ పరిస్థితేంటి? 

  • ACB: రిటైర్డ్ కాబోయే ఉపాధ్యాయుడి నుంచి లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన హెడ్మాస్టర్

  • Tesla Struggles in India: భారత్‌లో టెస్లా ఆపసోపాలు.. 7 నెలల్లో కేవలం 342 కార్లే విక్రయం.. దుమ్మురేపుతున్న ఇతర EV కార్లు..!

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions