నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ‘భగవంత్ కేసరి’. సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ మూవీలో బాలయ్య తెలంగాణ యాసలో డైలాగులు చెప్పి ఫ్యాన్స్ ని ఖుషి చేసాడు. భీమ్ షేర్ ఊచకోత అంటూ దసరాకి రిలీజ్ అయిన భగవంత్ కేసరి సినిమా బాలయ్య కెరీర్ బిగ్గెస్ట్ లో ఒకటిగా నిలిచింది. 150 కోట్లు రాబట్టి బాక్సాఫీస్ దగ్గర బాలయ్యకి హ్యాట్రిక్ హిట్ గా నిలిచింది. అఖండ, వీర సింహా రెడ్డి సినిమాల కన్నా భగవంత్ కేసరి పెద్ద హిట్ అయ్యింది. రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాకపోయినా బాలయ్య భగవంత్ కేసరి సినిమా వెయిట్ ని మోశాడు. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ సీన్ లో బాలయ్య పెర్ఫార్మెన్స్ ని మంచి అప్లాజ్ వచ్చింది. శ్రీలీల కూడా కెరీర్ బెస్ట్ యాక్టింగ్ తో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసింది. బాలయ్య లాంటి ఫైర్ బ్రాండ్ హీరోని పెట్టుకోని అనిల్ రావిపూడి కథకి మాత్రమే స్టిక్ అయ్యి భగవంత్ కేసరి సినిమా చెయ్యడం మంచి విషయం.
థియేట్రికల్ రన్ కంప్లీట్ చేసుకున్న భగవంత్ కేసరి సినిమా ఇటీవలే ఓటీటీలోకి వచ్చేసింది. ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న భగవంత్ కేసరి టాప్ ట్రెండింగ్ లో ఉంది. థియేట్రికల్ రన్ కంప్లీట్ అయ్యే ముందు భగవంత్ కేసరి సినిమాలో ఒక సాంగ్ ని యాడ్ చేసారు. ఇచ్చిపాడ్, ఇచ్చిపాడ్… మన పక్కనే ఉన్నాడు రా మాస్ గాడ్ అంటూ సాగిన సాంగ్ ని భగవంత్ కేసరి రోలింగ్ టైటిల్స్ టైంలో అటాచ్ చేసారు. అప్పటికే చాలా మంది థియేటర్స్ లో సినిమాని చూసేయడంతో సాంగ్ కోసం ప్రత్యేకంగా సినిమాకి వెళ్లలేదు. ఇప్పుడు ఈ సాంగ్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేసారు భగవంత్ కేసరి మేకర్స్. కాజల్, శ్రీలీల, బాలయ్యల ఎనర్జీతో ఈ పెళ్లి సాంగ్ అదిరిపోయింది చూసి ఎంజాయ్ చేయండి.
Ichipad Ichipad Ichipad…
Mana Pakkane unnadu ra MASS GOD 🔥The much-awaited #IchipadIchiPad video song from #BhagavanthKesari is out now 💥
–https://t.co/NfvXmFJNvD #NandamuriBalakrishna @AnilRavipudi @MsKajalAggarwal @sreeleela14 @MusicThaman @sahugarapati7 @harish_peddi… pic.twitter.com/rT62aFDTby
— Shine Screens (@Shine_Screens) December 8, 2023