యంగ్ హీరో సుశాంత్ హీరోగా నటించిన “ఇచ్చట వాహనములు నిలుపరాదు” మూవీ ఆగస్టు 27న విడుదలవుతోంది. యదార్థ సంఘటనల స్ఫూర్తితో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు మేకర్స్. టైటిల్ లో సూచించినట్లుగానే “ఇచ్చట వాహనములు నిలుపరాదు” మూవీ హీరో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ గురించి. ఓల్డ్ సిటీకి చెందిన ఒక అమ్మాయితో హీరో ప్రేమ కథ, ఆమె సోదరుడు, హీరో మధ్య ఫైట్, బైక్ కోసం హీరో పోరాటం… ఇలా మొత్తం కథ అటు ఇటు తిరిగి బైక్ తోనే ముడిపడి ఉండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. 2 నిమిషాల నిడివితో సాగిన ఈ ట్రైలర్ లో అన్ని ఎమోషన్స్ ను చూపించేశారు. నవరసాలతో పాటు సస్పెన్స్ కూడా క్రియేట్ చేశారు. గతంలో తెలుగు చిత్రాల్లో హీరోగా కన్పించిన నటుడు వెంకట్ కీలక పాత్రలో కన్పించి సర్ప్రైజ్ చేశారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, డైలాగులు కూడా బాగున్నాయి. ముఖ్యంగా ట్రైలర్ చివర్లో వచ్చే “సేల్ లో డిస్కౌంట్ బ్యాచ్ కాదు… హోల్ సేల్ గా లేపేసే బ్యాచ్” అనే డైలాగ్ ఆకట్టుకుంటోంది.
Read Also : “సర్కారు వారి పాట” మరో అరుదైన ఘనత
“ఇచ్చట వాహనములు నిలుపరాదు” చిత్రానికి ఎస్ దర్శన్ దర్శకత్వం వహించారు. ఏఐ స్టూడియోస్ అండ్ శాస్త్రా మూవీస్ బ్యానర్‌ల కింద రవిశంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీష్ కొయ్యలగుండ్ల ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం సమకూర్చారు. సుశాంత్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగులో ఇదే ఆమెకు మొదటి చిత్రం. ప్రియదర్శి, వెన్నెల కిషోర్ కీలకపాత్రల్లో నటించారు.