Site icon NTV Telugu

I Bomma Ravi : ఐ బొమ్మ రవి రిమాండ్ రిపోర్ట్.. షాకింగ్ విషయాలు వెలుగులోకి

Ibomma

Ibomma

I Bomma Ravi : ఐ బొమ్మ రవి రిమాండ్ రిపోర్ట్ ను పోలీసులు వివరించారు. ఐ బొమ్మ సైట్ వెనకాల ఉన్నది ఇమ్మడి రవినే అని టెక్నికల్ ఎవిడెన్స్ ను పోలీసులు సేకరించారు. పోలీసుల విచారణలో పైరసీ చేసినట్టు ఇమ్మడి రవి అంగీకరించాడు. ఏ విధంగా పైరసీ వెబ్ సైట్లు నడిపాడో పోలీసులకు చెప్పాడు. రవిని పట్టుకోవడంలో పబ్లిక్ డొమైన్ రిజిస్ట్రీ సహాయాన్ని సైబర్ క్రైమ్ పోలీసులు వాడారు. IBOMMA, BAPPAM పేరు మీద 17 వెబ్సైట్ లు రవి క్రియేట్ చేశాడు. ఐ బొమ్మ పేరు మీద IBOMMA.foo, ibomma.nexas, ibomma.market, ibomma.one ఉన్నాయి. Bappam పేరు మీద bappam.tv, bappam.cc,bappam.co.in, bappam.net, bappam.org bappam.eu లాంటి వెబ్సైట్ లు క్రియేట్ చేశాడు.

Read Also : I Bomma Ravi : ఐ బొమ్మ కేసులోకి ఈడీ ఎంట్రీ.. పెద్ద ఎత్తున మనీ లాండరింగ్

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు గాను క్రిప్టో కరెన్సీ వాలెట్ల నుండి రవి ICICI NRE ఖాతాకు పెద్ద ఎత్తున డబ్బులు వచ్చాయి. IBOMMA కు బెట్టింగ్ సైట్ లకు మధ్యలో కొన్ని ట్రాఫిక్ డొమైన్ లు రవి ఏర్పాటు చేసుకున్నాడు. Traders in.com, makeindiashop.shop అనే రెండు డొమైన్ లలో ఒకదాన్ని అమెరికాలో, ఇంకొకటి అమీర్ పేట్ లో రిజిస్టర్ చేయించాడు. ఈ రెండు డొమైన్లే రవిని పట్టించాయి. రవిని అరెస్టు చేయకపోతే ఇలాంటి వెబ్సైట్లు మళ్లీమళ్లీ సృష్టిస్తూనే ఉంటాడని పోలీసులు చెబుతున్నారు. రవి బెదిరింపులకు పాల్పడిన స్టేట్మెంట్లను సైతం రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు చేర్చారు. విదేశీ పౌరసత్వం తీసుకున్నాడు అంటేనే అతడి క్రిమినల్ ఇంటెన్షన్ అర్థం చేసుకోవచ్చని పోలీసులు చెబుతున్నారు. దేశ డిజిటల్ భద్రతకు రవి లాంటి వ్యక్తులు హానికరం అంటున్నారు. బెదిరింపులు, విదేశీ పౌరసత్వం తీసుకోవడం వెనక కుట్ర దాగి ఉందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Read Also : Balakrishna : వీడెందుకు వచ్చాడు.. అభిమానిపై బాలకృష్ణ ఫైర్

Exit mobile version