Site icon NTV Telugu

I Bomma Ravi : పైరసీ నెట్ వర్క్ పై నోరు విప్పని రవి..?

Ibomma Ravi

Ibomma Ravi

I Bomma Ravi : పైరసీ నెట్ వర్క్ మీద ఐ బొమ్మ రవి ఎలాంటి నోరు విప్పట్లేదని తెలుస్తోంది. మనకు తెలిసిందే కదా ఐ బొమ్మ రవిని పోలీసులు ఐదు రోజుల కస్టడీకి తీసుకున్నారు. తొలి రోజు కస్టడీలో భాగంగా వెబ్ సైట్ సర్వర్లు, బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులతో సంబంధాలపై ఆరా తీశారు. ఇక రెండో రోజు కస్టడీలో బ్యాంకు లావాదేవీలపై ప్రశ్నలు సంధించారు. పైరసీ నుంచి వచ్చిన డబ్బును ఎవరికి పంపించాడు, బెట్టింగ్ యాప్స్ డబ్బులను ఎలా రిసీవ్ చేసుకున్నాడనే కోణంలో ప్రశ్నలు వేశారు. మూడో రోజు రవికి ఉన్న భారీ నెట్ వర్క్ తో పాటు ఐపీ అడ్రస్ కూపీని లాగారు. మూడో రోజు స్వయంగా సీపీ సజ్జనార్ రవిని విచారించారు.

Read Also : Dharmendra : ధర్మేంద్ర మృతిపై టాలీవుడ్ హీరోల సంతాపం

రవి చెల్లెలు చంద్రిక, స్నేహితుడి గురించి తెలుసుకున్నారు. రవి ఫ్రెండ్ బ్యాంక్ ఖాతాకు పెద్ద ఎత్తున డబ్బులు మళ్లినట్టు పోలీసులు గుర్తించారు. నాలుగో రోజు రవి బ్యాంకు లావాదేవీలు, ఆస్తులు, సిజిటన్ షిప్, డబ్బును ఏం చేశాడు అనే కోణంలో విచారించారు. ఐదో రోజు రవి వెబ్సైట్స్, డొమైన్ నెట్వర్క్, ఐపి మాస్క్ లపై ప్రశ్నలు సంధించారు. అలాగే రూ.20 కోట్ల లావాదేవీలపై ప్రశ్నించారు. అయితే రవి తన పైరసీ నెట్ వర్క్ గురించి మాత్రం నోరు విప్పట్లేదని తెలుస్తోంది. పోలీసులు వీటి గురించి అడిగితే పొంతన లేని సమాధానాలు చెబుతున్నాడంట. అతను వాడిన సర్వర్లపై ఇంకా స్పష్టత రాలేదని తెలుస్తోంది. దీంతో ఎథికల్ హ్యాకర్ల సాయం తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు.

Read Also : Vijay Devarakonda : చిన్న హీరోలకు అండగా విజయ్ దేవరకొండ

Exit mobile version