క్రియేటివ్ డైరెక్టర్ అనే దగ్గర నుంచి సెన్సేషనల్ డైరెక్టర్ అని పిలిపించుకునే వరకూ వచ్చాడు రామ్ గోపాల్ వర్మ. ఇండస్ట్రీ హిట్స్ కి, న్యూ ఏజ్ ఫిల్మ్స్ కి కేరాఫ్ అడ్రెస్ లా ఉండే వర్మ, ఈ మధ్య మాత్రం సెన్సేషన్ అయిన టాపిక్స్ పైన మాత్రమే సినిమా చేస్తున్నాడు. వివాదాస్పదం అయిన విషయాలు, ఎక్కువగా కాంట్రవర్సీ క్రియేట్ చేసిన టాపిక్స్, రియల్ లైఫ్ స్టోరీస్… ఇలాంటి విషయాలనే కథాంశంగా చేసుకోని సినిమాలు చేస్తున్నాడు ఆర్జీవీ. సరిగ్గా ఇలానే కర్ణాటకలో గత కొన్ని రోజులుగా, బహిరంగ ఆరోపణలు చేసుకుంటూ దేశవ్యాప్తంగా వార్తల్లోకేక్కారు ఇద్దరు సివిల్ సర్వీసెస్ అధికారిణులు. కర్ణాటక కేడర్ ఐఏఎస్ ఆఫీసర్ రోహిణి, ఐపీఎస్ ఆఫీసర్ రూప మధ్య గత కొన్ని రోజులుగా వార్ ఆఫ్ వర్డ్స్ నడుస్తోంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ నేషనల్ వైడ్ హాట్ టాపిక్ అయ్యారు. దీంతో ఈ ఇద్దరి గొడవపై సినిమా వాళ్ల దృష్టి పడింది. ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ మధ్య వార్ అనేది సెల్లింగ్ ఐటెమ్, పైగా ఇద్దరూ లేడీస్… సో ఇద్దరు స్టార్ హీరోయిన్స్ ని కాస్ట్ చెయ్యగలిగితే ఒక మంచి ఫీమేల్ మల్టీస్టారర్ సినిమా అవుతుంది. ఈ విషయం ఇండస్ట్రీ వాళ్లకి బాగా తెలుసు కాబట్టే ఈ గొడవని కాష్ చేసుకోని సినిమా చెయ్యాలి అనే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ ఆలోచన చేసిన మన రామ్ గోపాల్ వర్మ కాదండోయ్.
బియాండ్ డ్రీమ్స్ అనే నిర్మాణ సంస్థతో పాటూ… ప్రవీణ్ శెట్టి అనే సినీ నిర్మాత కూడా రోహిణి vs రూప గొడవతో సినిమా చెయ్యడానికి కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ కి దరఖాస్తు చేసుకున్నారు. ‘ఆర్‌వి వర్సెస్ ఎస్‌ఆర్’ పేరు కావాలని బియాండ్ డ్రీమ్స్ అనే సంస్థ ద్వారా దరఖాస్తు చేసానని దర్శకుడు నిత్యానంద ప్రభు తెలిపారు. యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా ఉంటుందని దర్శకుడు తెలిపారు. టైటిల్ రిజిష్టర్ దరఖాస్తుపై చలనచిత్ర వాణిజ్య మండలి ఛైర్మన్ హరీష్ మాట్లాడుతూ రెండు దరఖాస్తులను సోమవారం కమిలీ ముందు ఉంచి, అందరి అభిప్రాయం తెలుసుకుని ప్రకటిస్తామని తెలిపారు. వ్యక్తి జీవితాధారంగా సినిమా తీయాలంటే వారి నుంచి ఎన్‌ఓసీ తీసుకోవాలని చెప్పారు. కర్ణాటకాలో ఐఏఎస్ అధికారిణి రోహిణీ సిందూరి, ఐపీఎస్ అధికారిణి రూపా మౌద్గిల్ పై ఇప్పటికే కర్ణాటకా ప్రభుత్వం శాఖాపరమైన విచారణకు ఆదేశించింది.