గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’. సూపర్ హిట్ సినిమాలు దర్శకుడు బాబీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే డాకు మహారాజ్ టైటిల్ గ్లిమ్స్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఇక టైటిల్ సాంగ్ తో ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించాడు తమన్. బాలయ్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ లో ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశి నిర్మిస్తున్నారు.
Also Read : Megastar : భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై చిరంజీవి సంతాపం
సంక్రాంతి కానుకగా జనవరి 12న వరల్డ్ వైడ్ గా డాకు మహారాజ్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటుంన్నాడు దర్శకుడు బాబీ. అందులో భాగంగా బాలయ్యపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. బాలయ్యతో వర్క్ చేస్తున్నప్పుడు ఒరిజినల్ బాలయ్య అంటే ఏంటో తెలిసింది. ఆయన చాల ఎమోషనల్, సెన్సాఫ్ హ్యూమర్ తెలిసింది. అసలు డైరెక్టర్ అనే వాడికి ఎంత గౌరవం ఇస్తారు అంటే మాటల్లో చెప్పలేను. ఆయనకి ఎంత స్ట్రెస్ ఉన్న, యాక్షన్స్ లో ఏదైనా దెబ్బ తగిలి బ్లడ్ వచ్చినా కుడా డైరెక్టర్ వస్తే రెడీ గురువుగారు షూట్ చేసేద్దాం అంటారు. అయన షూట్ లో ఉంటే నా అసిస్టెంట్స్ బాలయ్య ఎక్కడ ఉన్నారో అడుగుతాను. ఎందుకంటే అయన ఖాళీ టైమ్ లో స్మోక్ చేస్తూ, బుక్స్ చదువుతూ ఉంటారు. ఒకవేళ ఆ టైమ్ లో డైరెక్టర్ అటు వెళ్తే వెంటనే అన్ని పక్కన పెట్టేస్తారు. ఆయన టీమ్ ను డిస్ట్రబ్ చేయడం ఇష్టం లేక నా క్యారవాన్ ను బాలయ్య కు దూరంగా పెట్టమని చెప్తాను’ అని అన్నారు.