Site icon NTV Telugu

Genelia : సౌత్ సినిమాకు ఎప్పటికీ రుణపడి ఉంటా

Geniliya

Geniliya

సినిమా అవకాశాల కోసం నార్త్ నుండి సౌత్ లో అడుగుపెట్టి ఇక్కడ నిర్మాతలు, దర్శకులపై ఎక్కడ లేని ప్రేమ కురిపించి సినిమా ఛాన్సులు పట్టేస్తుంటరు. అలా సక్సెస్ అయ్యాక బాలీవుడ్ కు చెక్కేసి సౌత్ సినిమాలను తక్కువ చేసి మాట్లాడిన భామలు చాలా మంది ఉన్నారు. తమకు అంతటి గుర్తింపు తీసుకువచ్చి స్టార్ డమ్ ఇచ్చిన సౌత్ ను చిన్న చూపు చూస్తారు. మరికొందరు మాత్రం తమను ఈ స్థాయిలో నిలబెట్టిన ఇండస్ట్రీపై కృతజ్ఞత చూపిస్తుంటారు.
Also Read : HariHara VeeraMallu : హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ ఫిక్స్
లేటెస్ట్ గా ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ జెనీలియా సోత్ సినిమాపై తన అభిమానాన్ని చాటుకుంది. ఆమిర్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కిన సితారే జమీన్‌ పర్‌’ లో కీలక పాత్ర పోషించింది జెనీలియా. ఈ ఆర్‌.ఎస్‌. ప్రసన్న దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 20న విడుదల కు రెడీ అయింది. అందులో భాగంగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ‘సౌత్‌ మూవీస్‌లో హీరోయిన్లకు అంతగా ప్రాముఖ్యం ఉన్న రోల్స్ లభిస్తాయా’ అని  జెనీలియాను ప్రశ్నించారు. అందుకు తడుముకోకుండా జవాబు ఇచ్చింది. జెనీలియా మాట్లాడుతూ ‘ సౌత్ సినిమాలలో బలమైన పాత్రలు లభించవని అనుకోవడాన్ని అసలు ఒప్పుకోను. అందుకు ఉదాహరణ నా సినిమా కెరీర్. ‘‘ఒకసారి నేను నటించిన దక్షిణాది సినిమాలు చూడండి. నాకు ఎంతో మంచి రోల్స్‌ దక్కాయి. మైల్ స్టోన్ మూవీస్ చేసాను. అసలు నటనలో ఎక్కువ విషయాలు నేను నేర్చుకుంది సౌత్ సినిమా ఇండస్ట్రీలోనే. నాకు అంత మంచి అవకాశాలు అందించి, స్టార్ డమ్ అందించిన సౌత్‌ ఇండస్ట్రీకి రుణపడి ఉంటా’’ అని బదులిచ్చింది.
Exit mobile version