Pawan Kalyan : ఓజీ సినిమా కథ ఇప్పటికీ నాకు తెలియదు : పవర్ స్టార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీరగా గర్జించిన చిత్రం ‘ఓజీ’. సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 25న రిలీజ్ అయి పవన్ కళ్యాణ్ కెరీర్ లో అత్యధిక వసూళ్ళు రాబట్టిన సినిమాగా నిలిచింది. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం హైదరాబాద్ లోని ట్రైడెంట్ హోటల్ లో చిత్ర విజయోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. “అందరికీ ఓజీ యూనిట్ తరుపున నా హృదయపూర్వక నమస్కారాలు. ఒక సినిమా కథని రాయడం, చెప్పడం చాలా ఈజీ కానీ రాసిన కథను తెర మీదకు అలాగే తీసుకురావడం చాలా కష్టం. మీకు ఒక విషయం చెప్పాలి. అసలు ఇప్పటి వరుకు ఓజీ స్టోరీ ఏంటో నాకు తెలీదు. త్రివిక్రమ్ నేను మాట్లాడుకుంటున్నపుడు సుజిత్ టాపిక్ వచ్చింది. అలా ఓజీ స్టోరీ వినడానికి ఆయనని కలవడం జరిగింది. అప్పుడు ఆయన ఏం చెప్పాడు అంటే, మీరు ఒక కత్తి పట్టుకుని జపానీస్ డ్రెస్ లో ఉంటారు. గన్స్ ఉంటాయి, మీరు ఒక గ్యాంగ్ స్టర్. ఇలాగే చెప్పాడు కథ, నాకు ఏం అర్థం కాలేదు. కానీ సుజిత్ నాకు ఇచ్చిన పేపర్స్ ను మా అబ్బాయి అకీరా నందన్ చదువుతూ చాలా ఆనందం పడుతూ ఉండేవాడు. అప్పుడు అనిపించింది, ఈ తరం వాళ్ళకి అర్థం అయ్యే కథే ఓజీ సినిమా అని. సుజీత్ చాలా బాగా తీసాడు. అందుకే సుజిత్ కి నేను ఒక మాట ఇచ్చాను. ఓజీ సీక్వెల్ గానీ, ప్రీక్వెల్ గానీ మనం చేస్తున్నాం అని. ఒక ఫ్లాప్ సినిమా ఎంత నిరుత్సాహ పరుస్తుందో నాకు తెలుసు. కానీ ఓజీ సినిమా నాకు మళ్లీ సినిమా చేయాలి అనే బలాన్ని ఇచ్చింది. కాబట్టి నాకు ఉన్న సమయం లో ఓజి యూనివర్స్ కంటిన్యూ చెయ్యాలి అనుకుంటున్నాను. ముఖ్యంగా తమన్ ఇచ్చిన సంగీతం నన్ను తమ్ముడు సినిమా రోజులకి తీసుకువెళ్లింది. అలాగే అర్జున్ దాస్ అతని చూసినపుడు నేను చాలా ఫీల్ అవుతాను అలాంటి గొంతు నాకు లేదు’ అని అన్నారు.
Also Read
- Pawan Kalyan :మీరు అడిగారు, మేము విన్నాం.. ఓజీ యూనివర్స్‌లోకి స్వాగతం
- Pradeep Ranganathan: ఆ డైరెక్టర్'తో ప్రదీప్ రంగనాథన్ స్ట్రెయిట్ తెలుగు సినిమా!
- Rao Bahadur: "మీ కాలర్ పట్టుకుని లాగుతుంది.. బాడీలోకి పూనకాలు తెప్పిస్తుంది!" రావు బహదూర్’ మహేష్ బాబు రివ్యూ!
- Bunny Vas : తెలుగుమ్మాయని అవకాశం ఇస్తే.. మాకు 15 రూల్స్ పెట్టింది.
తాజావార్తలు
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
Bengaluru: కన్నడ నటి ఇంట్లో వ్యాపారవేత్త మృతి.. మిస్టరీగా మారిన కేసు
-
Yogurt Facial for Glowing Skin: ఖర్చు లేకుండా కాంతివంతమైన చర్మం.. పెరుగు ఫేషియల్ రహస్యం
-
T20 World Cup: మహిళా ప్రపంచకప్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి.. రికార్డులు బద్దలు..
-
India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్‌తో తలపడే ప్రతి టీ-20 సిరీస్‌లోనూ కొత్త కెప్టెనే..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!