Divya- Arnav Case: కోలీవుడ్ సీరియల్ కపుల్ దివ్య- అర్ణవ్ లా కేసు రోజురోజుకు ముదురుతోంది. అర్ణవ్ వేరొక నటితో సంబంధం పెట్టుకొని తనను వదిలించుకోవడానికి చూస్తున్నాడంటూ దివ్య చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. ఒక సీరియల్ ద్వారా పరిచయమైన ఈ జంట ప్రేమలో పడి రహస్యంగా పెళ్లి చేసుకొని కాపురం పెట్టారు. ఆ తర్వాత అర్ణవ్ వేరొక నటితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తెలియడంతో దివ్య పట్టుబట్టి తన పెళ్లిని అధికారికం చేసి షాక్ ఇచ్చింది. ఇక పెళ్లి తరువాత కూడా అర్ణవ్, వేరొక నటి అన్షితతో రాసలీలలు సాగించడం కొనసాగిస్తుండడంతో దివ్య పోలీసులను ఆశ్రయించింది. తన భర్త వేరొక నటితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, తాను గర్భవతిగా ఉన్నా కూడా తనను వేధిస్తున్నాడని చెప్పుకొచ్చింది.
ఇక తాజాగా దివ్య, అన్షిత, అర్ణవ్ ల మధ్య జరిగిన ఆడియో కాల్ లీక్ అయ్యింది. ఈ ఆడియో కాల్ లో అన్షిత, దివ్య మధ్య వాగ్వాదం జరిగింది. ఒక ఆడదానివి అయ్యి ఉండి మరొక ఆడదాని జీవితాల్లో నిప్పులుపోస్తావా..? నా భర్తను వదిలేయ్ అని దివ్య చెప్తుండగా.. ఛీ ఛీ నీలాంటి ఆడదాన్ని కొట్టి చంపాలన్నంత కోపంగా ఉంది నాకు అని అన్షిత బదులు ఇచ్చింది. నా భర్త నుంచి, మా జీవితంలో నుంచి బయటికి వెళ్ళు అని దివ్య చెప్పగా.. అన్షిత, దివ్య ముందే అర్ణవ్ కు ఐ లవ్ యూ చెప్పి ముద్దుల వర్షం కురిపించింది. ప్రస్తుతం ఈ ఆడియో నెట్టింట వైరల్ గా మారింది. ఒక మగాడి కోసం ఇద్దరు ఆడవాళ్లు కొట్టుకోవడం బావుందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.