లేడీ ఓరియెంటెడ్ సినిమాలకి, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తోంది ఐశ్వర్య రాజేష్. చెన్నైలో పుట్టిన ఈ తెలుగమ్మాయి కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయ్యింది. కెరీర్ స్తరింగ్ లో హీరోల పక్కన నటించిన ఐశ్వర్య రాజేష్, ఈరోజు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసే స్థాయికి తన మార్కెట్ ని పెంచుకుంది. మంచి పెర్ఫార్మర్ అయిన ఐశ్వర్య రాజేష్, రీసెంట్ గా ‘ఫర్హాన’ సినిమా చేసింది. ఇటీవలే రిలీజ్ అయిన ఈ మూవీ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. తెలుగులో కూడా రిలీజైన ఫర్హానా ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చిన ఐశ్వర్య రాజేష్ లేనిపోని గొడవలో ఇరుక్కుంది. మీడియా ఇంటరాక్షన్ సమయంలో ఒక ప్రశ్నకి సమాధానంగా “తెలుగులో తనకి పెద్దగా అవకాశాలు రావట్లేదు. పుష్ప సినిమాలో శ్రీవల్లి లాంటి పాత్రలు తనకి బాగా సెట్ అవుతాయ”ని ఐశ్వర్య రాజేష్ చెప్పింది.
ఈ మాట కాస్త అటు తిరిగి ఇటు తిరిగి “శ్రీవల్లి పాత్రని నేను రష్మిక కన్నా బాగా చేసేదాన్ని” అని ఐశ్వర్య రాజేష్ కామెంట్స్ చేసింది అంటూ వైరల్ అయ్యింది. దీంతో రష్మిక ఫాన్స్ సోషల్ మీడియాలో మా హీరోయిన్ నే అంటావా అంటూ ఐశ్వర్య రాజేష్ ని టార్గెట్ చేసి కామెంట్స్ చెయ్యడం మొదలుపెట్టారు. విషయం పెద్దగా అవుతుంది అనే విషయాన్ని త్వరగానే గ్రహించిన ఐశ్వర్య రాజేష్ “నేను రష్మికని అనలేదు, నాకు తనపట్ల తన వర్క్ పట్ల రెస్పెక్ట్ ఉంది. నేను శ్రీవల్లి లాంటి పాత్రలని బాగా చెయ్యగలను అని చెప్పాను కానీ రష్మిక కన్నా నేనే బాగా చేస్తాను అనలేదు. నా మాటని రాంగ్ గా అర్ధం చేసుకున్నారు” అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది. లెటర్ హెడ్ రిలీజ్ చేసి ఈ విషయాన్ని చెప్పిన ఐశ్వర్య రాజేష్, రష్మిక ఇష్యూని చాలా త్వరగా సెటిల్ చేసే ప్రయత్నం చేసింది. మరి నేషనల్ క్రష్ ఫాన్స్ ఇక్కడితో సైలెంట్ అవుతారో లేదో చూడాలి.
From the desk of Aishwarya Rajesh#AishwaryaRajesh @aishu_dil pic.twitter.com/J78oNsWQ9B
— Yuvraaj (@proyuvraaj) May 17, 2023