నేచురల్ బ్యూటీ అనగానే మనకు టక్కున గుర్తుకు వచ్చే పేరు సాయి పల్లవి. మొదటి చిత్రం తోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న.. ‘ఫిధా’ మూవీతో తెలుగు ప్రేక్షకులో తిరుగులేని క్రేజ్‌ని సంపాదించుకుంది. దీంతో వరుస అఫర్‌లు వచ్చాయి. కానీ కథ ఎంపిక విషయంలో ఈ ముద్దుగుమ్మ చాలా క్లారిటీగా ఉంటుంది. తన పాత్ర కు ప్రాముఖ్యత ఉంటే తప్ప ఒప్పుకోదు. ఇక ఏ హీరో తో జత కట్టిన కూడా క్యారెక్టర్ లో ఒదిగిపోతుంది. జీవించి తన పాత్రకు న్యాయం చేస్తుంది. అందుకే ఆమె నటన అంటే ప్రేక్షకులకు అంత ఇష్టం. ప్రస్తుతం నాగ చైతన్య సరసన ‘తండేల్’ మూవీ చేస్తుంది సాయి పల్లవి. దీంతో పాటుగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తూ.. హిందీలో తెరకెక్కుతున్న రామాయణం సినిమాలో సీతగా నటిస్తోందట.
ఇక ముందు నుంచి కూడా సింపుల్ సిటీ గా ఉండే సాయి పల్లవి.. ఎంత పెద్ద ఈవెంట్ అయిన పద్ధతిగా చీర లోనే రావడం ఆమె స్పెషల్. అంతే కాదు తను ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చెపడుతుందట. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ చిన్నది కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది.. సాయి పల్లవి మాట్లాడుతూ ‘నా చిన్నతనంలో మా కుటుంబంలో మేమే ధనవంతులం అనుకునేదాన్ని, కానీ అప్పుడు మా దగ్గర అంత డబ్బు లేదు. కానీ ఇప్పుడు పేదలకు సహాయం చేయడానికి నా దగ్గర తగినంత డబ్బు ఉంది’ అని నటి సాయి పల్లవి తెలిపింది. ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.