I Hate You Movie: ‘అథర్వ’ ఫేమ్ కార్తీక్ రాజు, మోక్ష, షెర్రీ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న ‘ఐ హేట్ యు’ చిత్రీకరణను పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. బి.లోకనాథం సమర్పణలో శ్రీ గాయత్రి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగరాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ సినిమాకి అంజి రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్న క్రమంలో నిర్మాత నాగరాజ్ మాట్లాడుతూ ‘‘మా ‘ఐ హేట్ యు’ చిత్రం లవ్ సైకలాజికల్ చిత్రంగా ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతోందని, డిఫరెంట్ సబ్జెక్ట్‌తో డైరెక్టర్ అంజిరామ్‌గారు సినిమాను చక్కగా తెరకెక్కించారని అన్నారు.
కార్తీక్ రాజు, మోక్ష, షెర్రీ అగర్వాల్ సహా అందరూ నటీనటుల, టెక్నీషియన్స్ చక్కటి సహకారాన్ని అందించటంతో అనుకున్న ప్లానింగ్ ప్రకారం మూవీని పూర్తి చేశామని సినిమా చాలా బాగా వచ్చిందని అన్నారు ప్రేమలో కొత్త కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్న క్రమంలో త్వరలోనే రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తాం’’ అన్నారు. కార్తీక్ రాజు, మోక్ష, షెర్రీ అగర్వాల్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి ఎస్.మురళీ మోహన్ రెడ్డి సినిమాటోగ్రఫీ, సాకార్ మ్యూజిక్, ప్రభోద్ స్టోరి, డైలాగ్స్ అందిస్తున్నారు. ‘ఐ హేట్ యు’ గురించి హీరో కార్తీక్ రాజు మాట్లాడుతూ “ఇదొక డిఫరెంట్ సినిమా అని ఓ విధమైన ప్రయోగం అని కూడా చెప్పవచ్చని అన్నారు. తెలుగులో ఇటువంటి కథతో సినిమా రాలేదని అనుకుంటున్నా అని అన్నారు.