Site icon NTV Telugu

Akhanda: బాలకృష్ణ అబద్దం ఆడతారని అనుకోను: మంత్రి నాని కొత్త ట్విస్ట్

Balakrishna-and-perni-nani

నందమూరి బాలకృష్ణ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలవనని చెప్పినట్టు కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారంలో నిజం ఉందని తాను అనుకోవడం లేదని మంత్రి నాని అన్నారు. ఈ రోజు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ‘అఖండ’ సినిమా విడుదలకు ముందు జరిగిన కొన్ని సంఘటనలను మీడియాకు తెలియచేశారు. హైదరాబాద్ లో ఉన్న బిల్డర్ నారాయణ ప్రసాద్ ద్వారా, నూజివీడు ఎమ్మెల్యే ద్వారా ‘అఖండ’ నిర్మాతలు తనని సినిమా విడుదలకు ముందు కలవడానికి విజయవాడ వచ్చారని, అదే సమయంలో వారు హీరో బాలకృష్ణతోనూ ఫోన్ లో మాట్లాడించారని నాని చెప్పారు. జగన్ ను కలుస్తానని బాలకృష్ణ చెప్పారని, అదే విషయాన్ని సీఎం జగన్ కు తాను తెలిపానని అన్నారు.

Read Also : Bigg Boss Non-Stop : కళ్ళు చెదిరేలా బిగ్ బాస్ హౌజ్.. వీడియో వైరల్

అయితే ‘అఖండ’ సినిమాకు సంబంధించి బాలకృష్ణ నిర్మాతలకు పూర్తి సహకారం అందించమని జగన్ తనతో చెప్పారని, బాలకృష్ణ తనను కలిస్తే అది వేరే విధమైన ప్రచారానికి కారణమౌతుందని అన్నారని నాని వెల్లడించారు. ‘అఖండ’ సినిమా నిర్మాతలు ఆ సినిమాను చక్కగా విడుదల చేసుకున్నారని, వారికి తాము ఏమైనా ఇబ్బంది కలిగించి ఉంటే చెప్పాలని నాని ప్రశ్నించారు. అప్పుడు సీఎం జగన్ ను కలుస్తానని చెప్పిన బాలకృష్ణ… ఇప్పుడు కలవనని చెబుతారని తాను అనుకోవడం లేదని, బాలకృష్ణ అబద్ధం చెబుతారని కూడా తాను భావించడం లేదని నాని అభిప్రాయపడ్డారు.

Exit mobile version