I 20 Movie to Release on June 14: సూర్యరాజ్, మెరీనా సింగ్ జంటగా నటించిన తాజా చిత్రం “ఐ – 20”, బీ అవేర్ ఆఫ్ గర్ల్స్ (అమ్మాయిలతో జాగ్రత్త) అనేది టాగ్ లైన్. సూగూరి రవీంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఆవిష్కార్ మూవీ క్రియేషన్స్ పతాకంపై పి.బి.మహేంద్ర నిర్మించారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించిన ఈ సినిమాతో మంచి సందేశం కూడా ఇచ్చేందుకు సిద్ధం అయింది సినిమా యూనిట్. ఈ సినిమా జూన్ 14న విడుదలకి రెడీ అయింది.
ఈ సందర్భంగా నిర్మాత మహేంద్రమాట్లాడుతూ “మన దేశం లో స్త్రీలని ప్రత్యేకంగా గౌరవిస్తాం, వాళ్ళ గౌరవం గురించి ఈ చిత్రాన్ని నిర్మించాం. కథ చాలా బాగా వచ్చింది, మంచి రొమాన్స్ ఉంది, కామెడీ అయితే అద్భుతంగా వచ్చిందని అన్నారు. ఇప్పటికి విడుదలైన పాటలు, టీజర్ , ట్రైలర్ పై మంచి రెస్పాన్స్ వచ్చింది, మొదటగా జూన్ 7న విడుదల చేద్దాం అనుకున్నాం కానీ ఆ రోజు నా చాలా సినిమాలు విడుదల అవుతున్నాయి అని జూన్ 14 విడుదల చేస్తున్నాం అని అన్నారు. తెలుగు ప్రేక్షకులు మంచి కంటెంట్ ఉన్న సినిమాలని ఎప్పుడూ ఆదరిస్తారు, అందులో మా సినిమా డిఫరెంట్ కాన్సెప్టుతో ఉంది కాబట్టి మా సినిమా పక్కాగా విజయం సాధిస్తుందని అన్నారు.