NTV Telugu Site icon

Hyper Aadi: పవిత్ర ముందే నరేష్ ను అవమానించిన ఆది.. రసరాయ.. గడ్డివాములు అంటూ

Aadhi

Aadhi

Hyper Aadi: జబర్దస్త్ నటుడు, కమెడియన్ హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హైపర్ ఆది కౌంటర్ వేశాడు అంటే మళ్లీ తిరిగి రీ కౌంటర్ వేయడం చాలా కష్టమే అని చెప్పాలి. ఒక నార్మల్ కంటెస్టెంట్ గా జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి.. టీమ్ లీడర్ గా మారి.. అన్ని షోస్ ను కవర్ చేస్తూ.. ఇంకోపక్క స్టార్ హీరో సినిమాల్లో నటిస్తూ.. కొన్ని సినిమాలకు డైలాగ్స్ రాస్తూ.. రెండు చేతులా సంపాదిస్తున్నాడు. ఇక ఎదుట ఉన్నది ఎంతవారైనా సరే వారిపై కామెడీ పంచులు వేయడంలో హైపర్ ఆది దిట్ట. అయితే తాజాగా.. ఒక షోలో హైపర్ ఆది.. సీనియర్ నటుడు నరేష్ పర్సనల్ విషయంలో అవమానించాడని అభిమానులు చెప్పుకొస్తున్నారు. అసలు విషయం ఏంటంటే.. వినాయక చవితి స్పెషల్ గా ఈటీవీ స్వామిరారా అనే ప్రోగ్రామ్ ను నిర్వహించింది. ఈ ఈవెంట్ కు గెస్ట్ గా పవిత్ర- నరేష్ వచ్చారు. వారు రావడంతోనే హైపర్ ఆది పంచ్ లతో స్వాగతం పలికాడు.

Tiger Nageswara Rao : ఏక్ దమ్ ఏక్ దమ్ అంటున్న టైగర్..

” ఏంటయ్యా.. వినాయక్ చవితి రోజున వినాయకుడి కోసం వస్తే .. పొట్ట వేసుకొని నువ్వు వచ్చావ్ అని హైపర్ ఆదితో నరేష్ అనగా .. రాంప్రసాద్ అలా పెట్టండి గడ్డి ఆడికి అంటూ అడ్డు వచ్చాడు. ఇక వెంటనే .. గడ్డివాము గురించి మన ముగ్గురమే మాట్లాడుకోవాలి అంటూ హైపర్ ఆది పంచ్ ఇచ్చాడు. ఇక ఆ తరువాత నరేష్ ను పవిత్ర ముద్దుగా ఏమని పిలుస్తారు అనిఅడుగగా .. ఆమె రాయ అని చెప్పింది. ఇక వెంటనే.. నవరసరాయ అని సర్ కు బిరుదు.. అందులో నుంచి రాయ అని తీసుకున్నారు. ఇకనుంచి నాకోసం రసరాయ అని పిలవమని మరో పంచ్ వేశాడు. ఇక చివర్లో నాకు ఒక పెళ్లే అవ్వడం లేదు.. మీకు పెళ్లి.. మళ్లీ పెళ్లి.. మళ్లీ పెళ్లి.. ఎలా సర్..? అంటూ అడిగాడు. ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. పర్సనల్ మ్యాటర్స్ గురించి హైపర్ ఆది అలా మాట్లాడడం నరేష్ ను అవమానించినట్లే అని, అది కూడా పవిత్ర ముందు అలా పంచ్ లు వేసి ఆయన పరువు తీసినట్లు చేశాడని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇక మరోపక్క అదంతా స్క్రిప్ట్ .. వారికి కూడా అది తెలుసు అని అంటున్నారు.

Show comments